తరచుగా కొన్ని విషయాలని మరిచిపోతున్నారా.. జ్ఞాపకశక్తి కోసం ఈ ఆహారాలు డైట్‌లో చేర్చండి..!

Do you often forget some things Include these foods in your diet for memory
x

తరచుగా కొన్ని విషయాలని మరిచిపోతున్నారా.. జ్ఞాపకశక్తి కోసం ఈ ఆహారాలు డైట్‌లో చేర్చండి..!

Highlights

తరచుగా కొన్ని విషయాలని మరిచిపోతున్నారా.. జ్ఞాపకశక్తి కోసం ఈ ఆహారాలు డైట్‌లో చేర్చండి..!

Health Tips: వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. ఈ పరిస్థితిలో చాలా విషయాలు మరిచిపోతుంటారు. ఈ సమస్య కొన్నిసార్లు యువతలో కూడా కనిపిస్తుంది. అందుకే జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. ప్రతిరోజూ బాదం, వాల్‌నట్ లేదా జీడిపప్పు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు

మీరు ఆహారంలో క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రోకలీ వంటి కూరగాయలను తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. పాలు, పెరుగు, కొవ్వు చేపలు, చిక్కుళ్ళు, బీన్స్, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, వోట్స్ మొదలైనవి డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతాయి.

మొలకలు, బచ్చలికూర, క్యారెట్లు,చిలగడదుంపలు మొదలైన వాటిలో కారిటినాయిడ్స్ అని పిలువబడే మూలకాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతాయి. అందుకే ఆహారంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. గుడ్డు సొనలు, తృణధాన్యాలు, సోయాబీన్స్, నువ్వుల గింజలు లెసిథిన్ అనే పోషకాన్ని కలిగి ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

విటమిన్ బి12 పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్, చేపలు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అలాగే జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. నిమ్మ, ఉసిరి, క్యాప్సికం వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, అత్తి పండ్లలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories