Lifestyle: మీరు కూడా పిల్లల్ని ఇలాగే పెంచుతున్నారా.? జాగ్రత్త..

Do you know what is the helicopter parenting and shows impact on kids
x

Lifestyle: మీరు కూడా పిల్లల్ని ఇలాగే పెంచుతున్నారా.? జాగ్రత్త.. 

Highlights

అయితే నిజానికి ఇది మంచే అయినా దీర్ఘకాలంలో మాత్రం కొన్ని సమస్యలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ప్రతీ పేరెంట్స్‌ తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని భావిస్తారు. అందుకోసం తమ శక్తివంచన మేరకు కృషి చేస్తుంటారు. అయితే చిన్నారులను పెంచే క్రమంలో ఒక్కొక్కరు ఒక్క మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు తమ పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో హెలికాప్టర్‌ పేరెంటింగ్ ఒకటి. ఇంతకీ హెలికాప్టర్‌ పేరెంటింగ్ అంటే ఏంటి.? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని ప్రతీ పేరెంట్‌ కోరుకుంటారు. అయితే ఈ సమయంలో తమ పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. నిత్యం వారు ఏం చేస్తున్నారు.? ఎటు వెళ్తున్నారు.? ఇలా ప్రతీ అంశాన్ని మానిటరింగ్ చేస్తుంటారు. అందుకే దీనిని హెలికాప్టర్‌ పేరెంటింగ్ అంటారు. అలాగే పిల్లలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలో పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటారు.

చిన్నారులకు ఏది మంచిదో, ఏదో చెడో వాల్లే ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని చిన్నారులపై బలవంతంగా రుద్దుతారు. చిన్నారులు చేసే ప్రతీ పనిని గమనిస్తూ అలా కాదు, ఇలా అంటూ చెబుతుంటారు. అయితే నిజానికి ఇది మంచే అయినా దీర్ఘకాలంలో మాత్రం కొన్ని సమస్యలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఆలోచన శక్తి తగ్గుతుంది. సొంతం నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

హెలికాప్టర్‌ పేరెంటింగ్‌ కారణంగా చిన్నారులు ఆత్మన్యూనత భావానికి గురవుతారు. వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోతారు. సమస్యల పరిష్కారానికి సొంతగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దీంతో పిల్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు హెలికాప్టర్‌ పేరెంటింగ్ వల్ల సామాజిక నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందవు. అందుకే ప్రతీ విషయంలో చిన్నారులను స్పై చేయడం, వారి వెంటబడడం వంటివి చేయకూడదని సూచిస్తున్నారు. వారికి కాస్త స్వేచ్ఛను ఇచ్చి, సొంతం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories