Gucci Mushroom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Gucci Mushroom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
x

Gucci Mushroom: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Highlights

Gucci Mushroom: ప్రపంచంలో అరుదైన పుట్టగొడుగులు ఉన్నాయని మీకు తెలుసా? భారతదేశంలోని కాశ్మీర్‌లో కనిపించే గుచ్చి పుట్టగొడుగు ప్రత్యేకత ఏంటో తెలుసా?

Gucci Mushroom: కాశ్మీర్‌లో పెరుగుతున్న గుచ్చి మష్రూమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఇది చాంటెరెల్స్, యూరోపియన్ వైట్ ట్రఫుల్ లేదా యార్ట్సా గున్‌బు ..వీటికంటే ఈ పుట్టగొడుగుల ధర వేలల్లో ఉంటుంది. అయితే ప్రపంచంలోని ఐదు అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటైన గుచ్చి భారతదేశంలోని దక్షిణ, ఉత్తర కాశ్మీర్‌లో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రత్యేకత ఏంటంటే..వీటిని మానవులు ఫామ్ చేయలేరు. ఎందుకంటే అవి వాటికంతట అవే సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. ఇంగ్లీషులో మోరెల్స్ అని, ఉర్దూలో గుచ్చి అని అంటారు. కొండలపై నివసించే వారు వీటిని కష్టపడి సేకరించి డబ్బు సంపాదించుకుంటున్నారు. దీన్ని ప్రకృతి యొక్క అమూల్యమైన నిధిగా అంటుంటారు. వీటిని సేకరించాలంటే ఎత్తైన కొండలు, పర్వతాలను ఎక్కాల్సి ఉంటుంది.

కాగా గుచ్చి పుట్టగొడుగులు మార్చి,ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న చాలా అందమైన గ్రామం అరిపాల్‌లో గుచ్చి ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ వీటిని ఎండబెట్టి మార్కెట్లోకి విక్రయిస్తుంటారు. నాణ్యమైన గుచ్చి కిలో రూ.40 వేల వరకు విక్రయిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు.చైనీస్,అరబిక్, ఇటాలియన్ వంటి అనేక రకాల వంటకాల్లో వీటిని ఉపయోగిస్తున్నప్పటికీ, కాశ్మీరీ ఆహారంలో వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని పులావ్, కోర్మా లేదా స్టఫింగ్‌లో తయారుచేసే రుచి మరే ఇతర వంటకాల్లో చూడలేము.

ప్రధాని మోదీకి చాలా ఇష్టం:

గుచ్చి కాశ్మీర్‌లోని ఇతర అద్భుతమైన రుచులతో కలిపితే, పులావ్ మరింత రుచికరంగా మారుతుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇష్టమైన కూరగాయలలో ఒకటిగా చేర్చారు. ఒక ఇంటర్వ్యూలో, ప్రధాని మోదీ దాని రుచి గురించి కూడా చెప్పారు. ఇవి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అతిథుల కోసం మాత్రమే తయారు చేస్తారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా గుచ్చి మష్రూమ్ బాగా డిమాండ్ ఉంది. కాశ్మీర్‌లో లభించే ఈ పుట్టగొడుగు నేడు ప్రపంచంలోని అనేక పెద్ద రెస్టారెంట్‌ల మెనూలో చేర్చడానికి కారణం ఇదే.

Show Full Article
Print Article
Next Story
More Stories