Drink Water: రోజు ఏ సమయం ఎంత మోతాదులో నీటిని తాగాలో తెలుసా..?

Do You Know How Much Water to Drink at Any Time of The Day
x

Drink Water: రోజు ఏ సమయం ఎంత మోతాదులో నీటిని తాగాలో తెలుసా..?

Highlights

Drink Water: రోజు ఏ సమయం ఎంత మోతాదులో నీటిని తాగాలో తెలుసా..?

Drink Water: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు బాగా తాగాలని డాక్టర్లు చెబుతారు. అయితే ఎంత మొత్తం నీళ్లు తాగాలనే విషయం ఎవ్వరికి తెలియదు. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు. ఉరుకుల పరుగుల జీవితం కారణంగా యువత నీరు తాగడంలో అశ్రద్ధ చూపుతారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అయితే ఒక వ్యక్తి రోజుకు ఎంత నీరు తాగాలి.. తద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.. తెలుసుకుందాం..

రోజులో ఎంత నీరు తీసుకోవాలనేది శరీరతత్వం, శారీరక శ్రమల స్ధాయి, వాతావరణం అంశాలని బట్టి ఉంటుంది. అయితే రోజుకు మాత్రం 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచిస్తున్నారు. వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసుల నీటిని సేవించండి. దీనివల్ల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. టిఫిన్, భోజనం ఇలా ఏ ఆహారానికైనా అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క. అలాకాకుండా ముడతలు పడుతూ వెంటనే పూర్వస్థితికి రాలేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకుని కనీసం గ్లాస్ వాటర్‌ను తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories