High Cholesterol Problem: బాడీలో కొలస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉందా.. ఈ నివారణ మార్గాలు తెలుసుకోండి..!

Do you have high cholesterol percentage in the body know these Remedies
x

High Cholesterol Problem: బాడీలో కొలస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉందా.. ఈ నివారణ మార్గాలు తెలుసుకోండి..!

Highlights

High Cholesterol Problem: వయసు పెరిగినా కొద్దీ చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉంటా రు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి.

High Cholesterol Problem: వయసు పెరిగినా కొద్దీ చాలామంది అనారోగ్యానికి గురవుతూ ఉంటా రు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. శారీరక శ్రమచేయకపోవడం, బాడీలో అధిక కొలస్ట్రాల్‌ పేరుకుపోవడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై శ్రద్ధపె ట్టాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. 40 ఏళ్ల తర్వాత, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. అందుకే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకో వడం అవసరం. ఇందుకోసం కొన్ని నివారణ మార్గాలు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటి?

కొలస్ట్రాల్‌ పెరగడానికి జీవనశైలిలో సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి, 8 నుంచి 9 గంటలు కూర్చోవడం, చాలా తక్కువ శారీరక శ్రమ వంటి అంశాలు చెడు కొలెస్ట్రాల్ పెరుగుద లకు కారణమవుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి ముందుగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఆహారంలో పండ్లు, కూర గాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి. ప్రోటీన్ కోసం న్-వెజ్ తింటుంటే నూనె, నెయ్యి వాడకం తగ్గించాలి.

ఆరోగ్యకరమైన ప్రొటీన్ల కోసం మొక్కల ఆహారాలపై దృష్టి పెట్టాలి. ఇందులో గింజలు, పప్పులు, బీన్స్ తీసుకోవచ్చు. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. ఆహారంలో సాధారణ కార్బో హైడ్రేట్లను తగ్గించాలి. ఆహారం నుంచి చక్కెర పదార్థాలను తొలగించాలి. ఆహారంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను చేర్చుకోవాలి. అలాగూ ఆహారం నుంచి ట్రాన్స్‌ఫాట్‌ను పూర్తిగా తొలగించాలి. భారతీయ మూలికలు వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి సుగంధ ధ్రవ్యాలను వంటలో చేర్చుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడమే కాకుండా పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రన్నింగ్, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా ఏదైనా అవుట్‌డోర్ గేమ్ ఆడటం వంటి కార్డియోపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, డ్యాన్స్ వంటి వాటిని దినచర్యలో చేర్చుకోవాలి. కూర్చుని పని చేస్తే అలారం సెట్ చేసి 30-40 నిమిషాలకు ఒక్కసారి అటు ఇటూ నడవాలి. అన్నం తిన్నతర్వాత అర్ధగంట సేపు వాకింగ్‌ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories