Health Tips: దిండు పెట్టుకొని నిద్రించే అలవాటు ఉందా.. ఈ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి..!

Do you Have a Habit of Sleeping with a Pillow these Health Problems Are Troubling
x

Health Tips: దిండు పెట్టుకొని నిద్రించే అలవాటు ఉందా.. ఈ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి..!

Highlights

Health Tips: రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది మెడకింద దిండు పెట్టుకొని నిద్రిస్తారు. ఇది మంచి పద్దతి కాదు.

Health Tips: రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది మెడకింద దిండు పెట్టుకొని నిద్రిస్తారు. ఇది మంచి పద్దతి కాదు. దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లగా నొప్పులు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ కొంతమంది దిండు లేకుండా నిద్రపోలేరు. మందంపాటి దిండు ఉపయోగించి నిద్రించడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మెడ నొప్పి

మందంపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల ముందుగా మెడపై ఎఫెక్ట్‌ పడుతుంది. దీనివల్ల మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి మిమ్మల్ని దీర్ఘకాలింగా వేధిస్తుంది. అందువల్ల మెడ నొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న మెత్తని ఉపయోగించాలి. కొంతవరకు నష్టాలని తగ్గించవచ్చు. కానీ దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకుంటే మంచిది.

వెన్నులో నొప్పి

కొంతమంది ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పిని అనుభవిస్తారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మందంపాటి దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్‌లలో దూరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల వెన్నెముకలో నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. అలాగే దిండుని పెట్టుకోకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి.

తలలో రక్త ప్రసరణ జరగదు

మందపాటి దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు తరచుగా తలనొప్పి సమస్య ఏర్పడుతుంది.

తిమ్మిర్ల సమస్యలు

మందంపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అంతేకాదు కొన్నిసార్లు మెడ నొప్పులు ఎక్కువై మెడకి పట్టీ కూడా పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే నిద్రించేటప్పుడు మెత్తని పెట్టుకోకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories