Milk: పాలు తాగితే బరువు పెరుగుతారా..! అసలు నిజమేంటి..?

Do you Gain Weight by Drinking Milk
x

పలుతో బరువు పెరుగడం (ఫైల్ ఇమేజ్)

Highlights

Milk: బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కొన్ని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి.

Milk: బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కొన్ని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. అయితే నిజంగా వీటిలో కొన్ని ఆరోగ్యానికి మంచి చేసేవి కొన్ని చెడు చేసేవి ఉంటాయి. అయితే వాటిని వీరు గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి. పాలు విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. పాలు తాగితే బరువు పెరుగుతారని కొంతమంది నమ్ముతారు. ఇది నిజమేనా.. వాస్తవానికి పాలు ఆరోగ్యకరం ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది కొవ్వును కూడా కలిగి ఉంటుంది. అయితే పాలు తాగితే నిజంగానే బరువు పెరుగుతారా అనే విషయం గురించి తెలుసుకుందాం.

పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కేలరీలు అధికంగా ఉంటాయి. 250 ml పాలలో 5 గ్రాముల కొవ్వు,152 కేలరీలు ఉంటాయి. పాలు ఎప్పుడు బరువును పెంచవు అంతేకాదు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పాలు ఆరోగ్యకరమైనది అంతేకాదు అధిక నాణ్యత గల ప్రోటీన్ మూలం. కండరాల నిర్మాణానికి, పెరుగుదలకు అవసరమైన పోషకం. జింక్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు తగిన మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు మీ ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అందువల్ల మీరు డైట్‌లో ఉన్నప్పటికీ రోజూ పరిమిత మొత్తంలో పాలు తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

తక్కువ కేలరీల ఆహారాన్ని అనుసరించే వ్యక్తులు పాల ఉత్పత్తులను నివారించే వారి కంటే రోజుకు మూడు సార్లు పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఎక్కువ బరువును కోల్పోతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అదనంగా పాల వల్ల కాల్షియం పొందడం, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీ ఆహారం నుంచి పాలు, పాల ఆధారిత ఉత్పత్తులను తగ్గించాల్సిన అవసరం లేదు. పాలు సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ ఒక కప్పు పాలు లేదా 250 ml పాలు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories