White Rice: వైట్‌ రైస్‌ ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలని గమనించండి..!

Do You Eat White Rice Higher Glycemic Index Score White Rice Disadvantages
x

White Rice: వైట్‌ రైస్‌ ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలని గమనించండి..!

Highlights

White Rice: మీరు వైట్ రైస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు రోగాలని ఆహ్వానిస్తున్నట్లే. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

White Rice: మీరు వైట్ రైస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు రోగాలని ఆహ్వానిస్తున్నట్లే. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వైట్‌ రైస్‌ తినడం మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచుతుంది. వైట్‌రైస్‌ తింటే కలిగే దుష్ప్రభావాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. వైట్‌రైస్‌ శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉండదు. కాబట్టి మీరు రోజూ అన్నం తింటుంటే జాగ్రత్తగా ఉండాలి. మీడియా నివేదికల ప్రకారం ఎక్కువ అన్నం తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైట్‌రైస్‌ని మితంగాతీసుకోవాలి.

అన్నం ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఆహారంలో ప్రధానంగా వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఉండాలి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి మంచిది. వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వైట్‌రైస్‌ని తినడం తగ్గించండి. అన్నం ఎక్కువగా తినడం వలన సులభంగా బరువు పెరుగుతారు. అన్నంలో ఉండే క్యాలరీలు బరువు పెరిగేందుకు సహాయపడతాయి. బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసేవారు అన్నం తక్కువగా తీసుకోవడం మంచిది.

అన్నం త్వరగా కడుపు నింపుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అన్నం తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయట. అందుకే తిన్న వెంటనే పడుకోకుండా.. కాస్త శారీరానికి శ్రమ కలిగించాలి. ఊబకాయంతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైట్ రైస్ తినడం మానేయాలి. మూడు పూటల అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories