నిద్రలేవగానే ఈ పనులు చేయండి.. 50 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తారు..!

Do These Things When you Wake up You Will Look Young Even at the Age of 50
x

నిద్రలేవగానే ఈ పనులు చేయండి.. 50 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తారు..!

Highlights

Skin Care: నేటి కాలంలో యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Skin Care: నేటి కాలంలో యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. మీరు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే 50 ఏళ్ల వయస్సులో కూడా యవ్వనంగా కనిపిస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం.

మొదటి పని

ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచి గోరువెచ్చని నీరు తాగాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి మలబద్ధకం ఉండదు. మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.

రెండవ పని

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే వ్యాయామానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలి.

మూడవ పని

ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడం. అవును రోజూ 45 నిమిషాల పాటు వర్కవుట్‌లు చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. చురుకుగా ఉంటారు. రోజువారీ వర్కవుట్‌లు చేస్తున్నప్పుడు బరువు కూడా అదుపులో ఉంటుంది.

నాలుగవ పని

నాల్గవ విషయం ఏంటంటే ఉదయం లేచిన తర్వాత తప్పనిసరిగా యోగా చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. చర్మంపై మెరుపు వస్తుంది.

ఐదవ పని

ఆరోగ్యకరమైన అల్పాహారం శరీరానికి చాలా ముఖ్యం. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. అల్పాహారం రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరం ఫిట్‌గా ఉంటుంది. చర్మం బిగుతుగా కనిపిస్తుంది. దీని కారణంగా మీరు చాలా కాలం పాటు యవ్వనంగా కనిపిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories