Relationship: మీ పార్ట్‌నర్‌కి ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. తెలిస్తే రిలేషన్‌ షిప్‌ క్లోజ్..?

Relationship: మీ పార్ట్‌నర్‌కి ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. తెలిస్తే రిలేషన్‌ షిప్‌ క్లోజ్..?
x

Relationship: మీ పార్ట్‌నర్‌కి ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. తెలిస్తే రిలేషన్‌ షిప్‌ క్లోజ్..?

Highlights

Relationship: మీ పార్ట్‌నర్‌కి ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. తెలిస్తే రిలేషన్‌ షిప్‌ క్లోజ్..?

Relationship: రిలేషన్‌ షిప్‌లో పూర్తి నిజాయితీ ఉండాలని, భాగస్వామి దగ్గర ఏ విషయం దాచకూడదని అంటారు. కానీ ఇది అన్ని విషయాలకు వర్తించదు. కొన్నిసార్లు మీ నిజాయితీ బందాన్ని బలపరిచే బదులు ముగించడానికి దారి తీస్తుంది. రిలేషన్ షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని విషయాలు భాగస్వామికి చెప్పకపోవడమే మంచిది. ఇది మీ పరస్పర సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా కొన్నిసార్లు విడిపోవడానికి కారణం అవుతుంది. భాగస్వామి ముందు ఎప్పుడూ ప్రస్తావించకూడని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1. పాత లైంగిక జీవితం గురించి ప్రస్తావన వద్దు

ప్రస్తుతం ప్రపంచం మునుపటి కంటే చాలా ధైర్యంగా మారింది. ఇప్పుడు ప్రజలు తమ భాగస్వామితో అన్ని రకాల విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ మీ భాగస్వామి ముందు పాత లైంగిక జీవితాన్ని గురించి ప్రస్తావించొద్దు. ఇలా చేయడం వల్ల మీపై గౌరవం తగ్గుతుంది. రకరకాల అనుమానాలు మొదలవుతాయి. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.

2. భాగస్వామి తల్లిదండ్రులకు చెడు చేయవద్దు

ప్రతి వ్యక్తికి మంచి లేదా చెడు ఉంటుంది. ఈ విషయం అందరికీ వర్తిస్తుంది. ఈ పరిస్థితిలో మీ భాగస్వామి తల్లిదండ్రుల గురించి మీకు నచ్చకపోతే వారి గురించి తప్పుగా మాట్లాడవద్దు. ఏ మనిషి తన తల్లిదండ్రులని అవమానిస్తే భరించలేరు. ఇలా చేయడం ద్వారా మీ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది కొన్నిసార్లు విడాకుల వరకు వెళుతుంది.

3. మీ భాగస్వామి లోపాన్ని ఎత్తి చూపవద్దు..

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తనకు నచ్చిన భాగస్వామిని ఎప్పటికి పొందలేడు. ఇది వాస్తవం అంతేకాదు పచ్చి నిజం. అందుకే వివాహం బంధం అంటే ఎన్నో రాజీలు, సయోధ్యలతో ముందుకు సాగాలి. మీ భాగస్వామికి కొన్ని లోపాలు ఉంటే దానిని పరిష్కరించగలిగితే పర్వాలేదు. కానీ ఆ లోపాన్ని వారిముందు పదే పదే ఎత్తి చూపకూడదు. ఇది ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతుంది.

4. గత సంబంధాల ప్రస్తావన వద్దు

ఆధునిక కాలంలో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలకు పెళ్లికి ముందే పరిచయాలు ఉంటాయి. ఈ పరిచయాల గురించి భార్యభర్తులు ఎప్పుడు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. పాత పరిచయం గురించి ఎప్పుడు చెప్పకపోవడమే బెటర్. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడతాయని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories