Health Tips: ఫ్రిడ్జ్‌లోఈ ఐటమ్స్‌ అస్సలు స్టోర్ చేయొద్దు.. చాలా బాధపడుతారు..!

Do Not Store These Items In The Fridge At All Very Dangerous To Health
x

Health Tips: ఫ్రిడ్జ్‌లోఈ ఐటమ్స్‌ అస్సలు స్టోర్ చేయొద్దు.. చాలా బాధపడుతారు..!

Highlights

Health Tips: ఇంట్లోకి కొత్తగా ఫ్రిజ్‌ వచ్చిందంటే చాలు అన్ని ఐటమ్స్‌ అందులోనే పెడుతుంటారు. ఇది మంచి పద్దతి కాదు.

Health Tips: ఇంట్లోకి కొత్తగా ఫ్రిజ్‌ వచ్చిందంటే చాలు అన్ని ఐటమ్స్‌ అందులోనే పెడుతుంటారు. ఇది మంచి పద్దతి కాదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన ఐటమ్స్‌ కొన్ని ఉంటాయి అలాగే కొన్ని పెట్టకూడని ఐటమ్స్‌ కూడా ఉంటాయి. ఇవి తెలియకపోతే కొన్ని రోజుల్లోనే ఆస్పత్రి పాలవుతారు. అనేక రోగాల బారినపడే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని ఆహారాలు, పదార్థాలు, పండ్లు, కూరగాయల గురించి తెలుసుకుందాం.

ఆయిల్స్

చాలా మంది ఆయిల్స్ చాలాకాలం నిల్వ ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. కొబ్బరి, ఆలీవ్, బాదం, తేనె, వెజిటేబుల్, వంట నూనె మొదలైనవి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. దీనివల్ల ఇవి గట్టి పడిపోతాయి. వీటిని వేడి చేసి ఉపయోగిస్తే చాలా ప్రమాదం. కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

వెల్లుల్లి

చాలా మంది వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో పెడుతారు. వీటి వల్ల వెల్లుల్లి రుచి, వాసన కోల్పోతాయి. సాఫ్టా్‌గా మారిపోయి పనికిరాకుండా మారుతాయి. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టవద్దు.

టమాటాలు, ఆలుగడ్డ

టమాటాలు ఫ్రిడ్జ్ లోపెడితే వాటి టేస్ట్ మారిపోతుంది. వీలైనంత వరకూ వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడమే మంచిది. అలాగే ఆలుగడ్డలు ఫ్రిడ్జ్ లోపెట్టడం వల్ల అందులో ఉండే పిండి పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు.

ఉల్లిపాయలు

కొంత మంది ఉల్లి పాయలను కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూంటారు. దీని వల్ల ఉల్లి పాయల్లోని తేమ పోతుంది. మెత్తగా మారిపోతాయి. ఫ్రిడ్జ్‌ మొత్త ఉల్లిపాయల వాసన వస్తుంది. వీటిని ఫ్రిడ్జ్ లో స్టోర్‌ చేయకూడదు.

అరటి పండ్లు

అరటి పండ్లను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదు. రుచి కోల్పోయి నిర్జీవంగా మారుతాయి. ఫ్రిడ్జ్ మొత్తం అరటిపండ్లు వాసన వస్తుంది. అలాగే బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్‌ చేయకూడదు. ఎందుకంటే బ్రెడ్ లోని ఉండే స్టార్చ్ విచ్ఛిన్నం అవుతుంది. దీని వల్ల బ్రెడ్ త్వరగా పాడైపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories