పెరుగులో ఇవి క‌లుపుకొని తిన‌కండి.. మంచిది కాదు..

Do not Mix and Eat these 4 Foods in Yogurt
x

పెరుగు (ఫైల్ ఫోటో)

Highlights

*ప్ర‌తి రోజు పెరుగు తీసుకుంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉంటుంది * అరటిపండు, పెరుగును కలిపి తినకూడదు

Curd: భోజ‌నంలో చివ‌రి ముద్ద పెరుగుతో తిన‌కుంటే అస‌లు ఆరోజు అసంపూర్తిగానే ఉంటుంది. ఎందుకంటే పెరుగు ప్ర‌తి ఒక్క‌రికి అంత‌లా అల‌వాటైపోయింది. అయితే ఇది మంచిదే, పెరుగులో చాలా పోష‌కాలు ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ప్ర‌తి రోజు పెరుగు తీసుకుంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉంటుంది. కానీ పెరుగుతో క‌లిపి కొన్ని ఆహారాల‌ను అస్స‌లు తిన‌కూడ‌దు. ఎందుకంటే ఈ కాంబినేష‌న్ పాయిజ‌న్‌గా మారే అవ‌కాశం ఉంది. అలాంటి ప‌దార్థాల గురించి తెలుసుకుందాం.

1.పాలు - పెరుగు: రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు పాలు తాగితే పెరుగు తినకండి. పెరుగు తింటే పాలు తాగకండి. ఈ రెండు కలిపి తీసుకోకూడదు. ఇది గ్యాస్, డయేరియా, ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది.

2.పెరుగు - చేపలు: పెరుగు, చేపలను కలిసి తినకూడదని మీలో చాలామంది విన్నారు. ఈ రెండు కలిసి తినడం హానికరం. ఇది వాంతులు, అజీర్ణానికి దారితీస్తుంది.

3.పెరుగు - ఉల్లిపాయలు: వేసవి రోజులలో తినడానికి ఇష్టపడతారు. ఉల్లిపాయ వేడిగా ఉన్నప్పుడు పెరుగు చల్లగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల అలెర్జీలు, గ్యాస్, ఆమ్లత్వం, వాంతులు వస్తాయి. ఈ రెండింటినీ ఎప్పుడూ తినకూడదు.

4.అరటి - పెరుగు: ఎప్పుడూ అరటిపండు, పెరుగును కలిపి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. మీరు బదులుగా పాలు, అరటిపండ్లు తినవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories