Mistakes After Eating: భోజనం తర్వాత ఇలా చేయొద్దు..!

Do not Make These Mistakes Immediately After Eating You will Gain Weight Tremendously
x

Mistakes After Eating: భోజనం తర్వాత ఇలా చేయొద్దు..!

Highlights

Mistakes After Eating: ఆధునికి జీవన విధానంలో శ్రమ లేకపోవడంతో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు.

Mistakes After Eating: ఆధునికి జీవన విధానంలో శ్రమ లేకపోవడంతో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. దీనికి తోడు కరోనా వైరస్ తోడవడంతో అందరూ ఇంటి నుంచి పని మొదలుపెట్టారు. దీంతో బరువు పెరిగి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే భోజనం చేశాక కొంతమంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. వీటివల్ల బరువు పెరుగుతున్నామన్న సంగతి వారికి కూడా తెలియకపోవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. పండ్ల తినడం: భోజనం తర్వాత పండ్లను అతిగా తినకండి. ఇది ఆహారాన్ని గ్రహిస్తుంది. పండ్లను వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక భోజనం తిన్నవెంటనే పండ్లు తినవద్దు.

2. ధూమపానం: చాలా మందికి భోజనం చేసాక వెంటనే ధూమపానం అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల బరువు పెరుగుతారు. అదనంగా సిగరెట్లలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి.

3. నిద్ర: సాధారణంగా భోజనం తర్వాత అందరూ బెడ్ మీదకి వాలిపోతారు. కానీ ఇది తప్పు. మీరు భోజనం చేసిన వెంటనే నిద్రపోతే కడుపు ద్వారా ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలు పెరుగుతాయి మరియు గుండెల్లో మంటను కలిగిస్తాయి.

4. వ్యాయామం: భోజనం తర్వాత వెంటనే వ్యాయామం చేయడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. వాంతులు, కడుపు నొప్పి కూడా రావొచ్చు. భోజనం తర్వాత సూచించే ఏకైక వ్యాయామం వజ్రసనా. ఇది జీర్ణ ప్రక్రియను పరిష్కరిస్తుంది.

5. స్నానం: భోజనం తర్వాత స్నానం చేయడం మానుకోండి. మీరు భోజనం తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రక్తం చర్మానికి వెళుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories