Cholesterol: కొలస్ట్రాల్ నిర్లక్ష్యం చేయకండి.. ఈ లక్షణాలు గమనించండి..!

Do not Ignore Cholesterol Note These Symptoms
x

Cholesterol: కొలస్ట్రాల్ నిర్లక్ష్యం చేయకండి.. ఈ లక్షణాలు గమనించండి..!

Highlights

Cholesterol: ఈ రోజుల్లో అధికంగా పెరిగిన కొలెస్ట్రాల్‌తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

Cholesterol: ఈ రోజుల్లో అధికంగా పెరిగిన కొలెస్ట్రాల్‌తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయి బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు గుండె జబ్బులు, పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే ఒక మైనపు పదార్థం. దీని పరిమాణం పెరిగినప్పుడు అది రక్తనాళాలను అడ్డుకుంటుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. అలాంటి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

కొవ్వు పెరగడం వల్ల శరీరంలో అలసట, బలహీనత, కళ్ళ చుట్టూ పసుపు రంగు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. కీళ్లలో నొప్పులు ఏర్పడినా శరీరంలో కొవ్వు పెరిగినట్లుగా అర్థం చేసుకోవాలి. అయితే అన్ని నొప్పులు దీనివల్ల రావని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు కచ్చితంగా ఫ్యాట్ చెక్‌చేసుకోవాలి.

అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం క్యాన్డ్ బీన్స్ వంటి చిక్కుళ్ళు తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మీరు రోజూ 180 గ్రాముల వివిధ రకాల బీన్స్ తింటే మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా ఆపవచ్చు. బీన్స్‌లో ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories