Health Tips: కాల్షియం లోపాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.. వెంటనే ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!

Do not ignore Calcium Deficiency immediately include these foods in the Diet
x

Health Tips: కాల్షియం లోపాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.. వెంటనే ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Health Tips: కాల్షియం లోపాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.. వెంటనే ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!

Health Tips: కాల్షియం శరీరానికి అవసరమైన ఖనిజం. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కండరాల ఆరోగ్యానికి కూడా అవసరం. ప్రస్తుతం చిన్నవయసులోనే చాలామంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. దీనిని సరిచేయడానికి మార్కెట్‌లో అనేక రకాల సప్లిమెంట్లు ఉన్నాయి. అయితే కాల్షియం లోపాన్ని తీర్చడానికి ఎముకలు బలహీనపడకుండా నిరోధించడానికి కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.

విత్తనాలు

కొన్ని పండ్లు, కూరగాయలలో కాల్షియం నిల్వలు విరివిగా ఉంటాయి. చియా, గసగసాలు, ఉసిరికాయ, పొద్దుతిరుగుడు, లిన్సీడ్ విత్తనాలలో కాల్షియం పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఈ గింజలను పాలతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

నట్స్, డ్రైఫ్రూట్స్

నట్స్, డ్రైఫ్రూట్స్ కాల్షియానికి అద్భుత మూలం. వాల్‌నట్స్, బాదం, వేరుశెనగలో పెద్ద మొత్తంలో కాల్షియం లభిస్తుంది. ఇలాంటి డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పెరుగు, పనీర్, పాలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం లోపం ఉండదు. వీటి ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.

బ్రోకలీ

బ్రోకలీ ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు కూడా పెద్ద పరిమాణంలో ఉంటాయి. కాల్షియం లోపాన్ని భర్తీ చేయాలనుకుంటే బ్రోకలీని కూరగాయలు లేదా సూప్ తయారు చేసి ఆహారంలో చేర్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories