Kidney Stone In Children: పిల్లలకి ఇవి తినిపించవద్దు.. కిడ్నీలో రాళ్ల సమస్యలు..!

Do not Feed these Foods to the Child It Will Cause Problems of Kidney Stones
x

Kidney Stone In Children: పిల్లలకి ఇవి తినిపించవద్దు.. కిడ్నీలో రాళ్ల సమస్యలు..!

Highlights

Kidney Stone In Children: నేటి రోజుల్లో పిల్లలు కొన్ని రకాల ఆహారాలకి అలవాటు పడటం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి.

Kidney Stone In Children: నేటి రోజుల్లో పిల్లలు కొన్ని రకాల ఆహారాలకి అలవాటు పడటం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. 30 ఏళ్ల క్రితం పెద్దవాళ్లలో మాత్రమే కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని వయసుల వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. యాంటీబయాటిక్స్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్, హాట్ టెంపరేచర్ కారణంగా కిడ్నీ స్టోన్స్ సమస్యలు వస్తున్నాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

మూత్రపిండాలలో ఏర్పడిన రాయి ఖనిజాలు, లవణాల మిశ్రమం అని చెప్పవచ్చు. ఇది కొన్నిసార్లు మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య టీనేజర్స్‌లో ఎక్కువగా కనిపిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో జంక్ ఫుడ్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నెఫ్రోలిథియాసిస్ అనేది మూత్రపిండాలకి సంబంధించిన సమస్య. ఇందులో కాల్షియం, ఆక్సలేట్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు నిక్షిప్తమవుతాయి. దీంతో మూత్రం కఠినమైన పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు ఇసుకతో చేసిన చిన్న బంతి లేదా గోల్ఫ్ బాల్ పరిమాణంలో తయారవుతాయి. ఇవి కొన్ని సందర్భాల్లో మూత్ర నాళం గుండా బయటికి వెళుతాయి. కానీ చాలా సార్లు అది మూత్ర నాళంలో చిక్కుకుపోతుంది. దీంతో రోగి తీవ్రమైన నొప్పి, రక్తస్రావం సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎనర్జీ డ్రింక్స్ ప్రమాదకరం

చిప్స్, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల రాళ్ల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు తక్కువ నీరు తాగడం, అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఆహారాలు తీసుకోవడం హానికరం. అందుకే ఇలాంటి ఆహారాలకి పిల్లలని దూరంగా ఉంచాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories