Health Tips: పరగడుపున వీటిని అస్సలు తీసుకోవద్దు.. శరీరానికి చాలా ప్రమాదం..!

Do not Eat These Substances on Empty Stomach It will Cause a Lot of Harm to The Body
x

Health Tips: పరగడుపున వీటిని అస్సలు తీసుకోవద్దు.. శరీరానికి చాలా ప్రమాదం..!

Highlights

Health Tips: ఎక్కువసేపు ఆకలితో ఉంటే ఎసిడిటీ, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి

Health Tips: శరీరంలో శక్తి లేకపోతే చిన్నపని చేయడం కూడా కష్టమే. ఎక్కువసేపు ఆకలితో ఉంటే ఎసిడిటీ, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ ఉదయంపూట తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ ఆహారాలు తింటే చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల కడుపు ఆరోగ్యం చెడిపోతుంది. అలాంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆల్కహాల్

ఆల్కహాల్‌ తాగడం ఎల్లప్పుడూ ఆరోగ్యానికి హానికరం. దీనిని పూర్తిగా నివారించడం మంచిది. దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది అంతేకాక గుండెపోటు ప్రమాదం పొంచి ఉంటుంది. ఖాళీ కడుపుతో తాగడం మరింత హానికరం. ఏమీ తినకుండా ఆల్కహాల్ తాగితే అది నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. దీని కారణంగా పల్స్ రేటు పడిపోతుంది. రక్తపోటు పెరుగుతుంది.

చూయింగ్ గమ్

పిల్లలు తరచుగా చూయింగ్ గమ్‌ నములుతారు. ఖాళీ కడుపుతో ఇలా చేయడం మంచిదికాదు. దీనివల్ల జీర్ణ ఆమ్లాలు కడుపులో విడుదలవుతాయి. ఈ యాసిడ్స్ వల్ల పొట్టలో పుండు లేదా ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఒకవేళ చూయింగ్ గమ్ నమలాలనుకుంటే ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పని చేయడం మంచిది.

కాఫీ

కాఫీ తాగడం వల్ల అలసట తొలగిపోతుంది. శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. అందుకే చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది మంచి పద్దతి కాదు. ఎందుకంటే ఈ పానీయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కు కారణమయ్యే రసాయనాలు ఉంటాయి. ఇవి కడుపులో మంటని కలిగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories