Health Tips: ఈ ఆహారాలని మరుసటి రోజు తినవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..!

Do not Eat these Leftovers the Next Day not Good for Health at all
x

Health Tips: ఈ ఆహారాలని మరుసటి రోజు తినవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..!

Highlights

Health Tips:కొంతమందికి రాత్రిపూట మిగిలిపోయిన ఆహారం ఉదయం పూట వేడి చేసుకొని తినే అలవాటు ఉంటుంది.

Health Tips: కొంతమందికి రాత్రిపూట మిగిలిపోయిన ఆహారం ఉదయం పూట వేడి చేసుకొని తినే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వాస్తవానికి ఆహారం వృథా చేయకూడదు. అలాగని అనారోగ్యకరమైన ఆహారాన్ని అస్సలు తినకూడదు. మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని జరుగుతుంది. అలాంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. ఆయిల్ ఫుడ్స్

భారతదేశంలో నూనెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నూనెలో వండిన ఆహారం ఎక్కువ రుచిగా ఉంటుంది. పెళ్లిళ్లలోనో, పార్టీల్లోనో మిగిలిన ఆయిల్ ఫుడ్‌ని ప్యాక్ చేసి మరుసటి రోజు వేడి చేసి తింటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే నూనెతో వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. మధుమేహం ముప్పు పెరుగుతుంది. అలాగే బరువు పెరగడానికి కారణం అవుతుంది.

2. ఉడకబెట్టిన బంగాళాదుంపలు

ఉడికించిన బంగాళాదుంపలను తినడానికి చాలామంది ఇష్టపడుతారు. వీటితో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మార్కెట్‌లో లభించే తినుబండారాల తయారీలో రెండు రోజుల క్రితం ఉడకబెట్టిన బంగాళాదుంపలని కూడా ఉపయోగిస్తారు. వీటి కారణంగా బంగాళాదుంపలోని క్లోస్ట్రిడియం బోటులినమ్ కుళ్ళిపోతుంది. ఇది మన కడుపులో వివిధ సమస్యలకి కారణం అవుతుంది.

3. గుడ్డు

గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రత్యేకంగా టిఫిన్‌గా తీసుకోవడం ఉత్తమం. అయితే మరుసటి రోజు ఉడకబెట్టిన గుడ్డు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో అనేక రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories