Conjunctivitis: కండ్ల కలకలు వస్తే ఈ ఆహారాలు తినవద్దు.. ఇన్ఫెక్షన్‌ మరింత పెరిగే అవకాశం..!

Do Not Eat These Foods If You Get Conjunctivitis The Infection Will Increase
x

Conjunctivitis: కండ్ల కలకలు వస్తే ఈ ఆహారాలు తినవద్దు.. ఇన్ఫెక్షన్‌ మరింత పెరిగే అవకాశం..!

Highlights

Conjunctivitis: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కండ్లకలక అంటే ఐ ఫ్లూ (కంటి ఇన్ఫెక్షన్) వేగంగా విస్తరిస్తోంది.

Conjunctivitis: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కండ్లకలక అంటే ఐ ఫ్లూ (కంటి ఇన్ఫెక్షన్) వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా దీనికి గురవుతున్నారు. కండ్ల కలక వచ్చినప్పుడు కళ్లు ఎర్రబడి వాచిపోతాయి. తరచుగా దురద పెడుతాయి. కళ్ల నుంచి పసుపు రంగు ద్రవం కారుతుంది. పిల్లలు జ్వరానికి గురవుతారు. బాక్టీరియా లేదా అలర్జీల వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. ఈ సమయంలో ఆహారం, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవి కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కండ్ల కలక సమయంలో తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

స్పైసి ఫుడ్: స్పైసి ఫుడ్ తినడం వల్ల కళ్లలో చికాకు, అసౌకర్యం కలుగుతుంది. వాటి నుంచి వచ్చే ఘాటైన పొగ కళ్లకి అస్సలు మంచిది కాదు.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు: సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు. దీనివల్ల కళ్ల చుట్టూ నీరు చేరి వాపు వస్తుంది. ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది.

సిట్రస్ పండ్లు : నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి కళ్లకు చికాకు కలిగిస్తాయి.

పాల ఉత్పత్తులు : పాల ఉత్పత్తులు, పాశ్చరైజ్ చేయని పాలు, హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇవి కంటి ఇన్ఫెక్షన్‌లను తీవ్రతరం చేస్తాయి.

ఆల్కహాల్, కెఫిన్ పానీయాలు : ఆల్కహాల్, కెఫిన్ కలిగిన పానీయాలు డీహైడ్రేషన్‌కి కారణమవుతాయి. ఇవి మొత్తం వైద్యం ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.

అలెర్జీ ఆహారాలు : మీకు ఏదైనా అలెర్జీ ఉన్నట్లయితే ఆ ఆహారాలను తినకూడదు. ఎందుకంటే అవి కంటి ఇన్ఫెక్షన్‌ను మరింత పెంచుతాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి..

1. రక్షణ కోసం తరచుగా చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.

2. కళ్లను మళ్లీ మళ్లీ తాకవద్దు.

3. కండ్ల కలక సోకిన వ్యక్తి తువ్వాలు, రుమాలు, దుస్తులు తాకవద్దు.

4. రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దు.

5. కంటి ఫ్లూ సమయంలో నీటిలో ఈత కొట్టవద్దు.

6. సలహా లేకుండా మందులు తీసుకోవద్దు

7. కళ్లను శుభ్రం చేయడానికి శుభ్రమైన క్లాత్‌ లేదా టిష్యూ పేపర్ వాడాలి.

8. నల్ల అద్దాలు పెట్టుకోవాలి.

9. కాంటాక్ట్ లెన్స్ అస్సలు ఉపయోగించవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories