Health Tips: విమాన ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినవద్దు.. అనుకోని సమస్యలు ఎదురవుతాయి..!

Do not Eat These Foods Before Flying Unexpected Health Problems Will Occur
x

Health Tips: విమాన ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినవద్దు.. అనుకోని సమస్యలు ఎదురవుతాయి..!

Highlights

Health Tips: మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటుంది.

Health Tips: మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇంకా విండో సీటు దొరికిందంటే ఆ మజా వేరు ఉంటుంది. కానీ విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఆహారం విషయంలో అలర్ట్‌గా ఉండాలి. ఏమి తినకుండా విమాన ప్రయాణం చేయడం అంత మంచిది కాదు అలాగే అతిగా తినికూడా విమానప్రయాణం చేయకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

స్పైసి ఫుడ్

విమానంలో ప్రయాణించే ముందు బిర్యానీ, ఊరగాయలు వంటి ఆయిల్, స్పైసీ ఫుడ్ తినకూడదు. ఎందుకంటే వీటివల్ల కడుపు నొప్పి వస్తుంది. గుండె మంట, మూత్రాశయం చికాకు సమస్య ఉంటుంది. ఈ ఆహారాలు అధిక కేలరీలను కలిగి ఉంటాయ. దీని కారణంగా నోటి నుంచి వాసన వస్తుంది.

వేయించిన ఆహారాలు

ఎయిర్‌పోర్ట్‌లో కనిపించే వేయించిన ఆహారాలని చూసి అందరు ఆకర్షితులవుతారు. వీటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఎగిరే ముందు బర్గర్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల గుండెల్లో మంట వస్తుందని గుర్తుంచుకోండి.

ఆపిల్

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇందులో జీర్ణం కావడం కష్టంగా ఉండే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. యాపిల్స్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మీరు విమానానికి ముందు బొప్పాయి లేదా నారింజ పండ్లను తినవచ్చు. కానీ ఆపిల్‌ తినవద్దు.

స్నాక్స్

చాలా మంది ఫ్లైట్ ఎక్కే ముందు స్నాక్స్ తింటారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదం కంటే తక్కువేమి కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్నాక్స్ అజీర్ణం, వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. అలాగే విమాన ప్రయాణానికి ముందు బ్రోకలీతో చేసిన ఆహారాలు తినకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories