Quitting Smoking: స్మోకింగ్‌ మానేసే సమయంలో ఈ పానీయాలు తాగవద్దు.. సమస్య మరింత జఠిలం..!

Do not Drink These Drinks While Quitting Smoking the Problem Will Increase
x

Quitting Smoking: స్మోకింగ్‌ మానేసే సమయంలో ఈ పానీయాలు తాగవద్దు.. సమస్య మరింత జఠిలం..!

Highlights

Quitting Smoking: చిన్నగా మొదలైన సమస్య ప్రాణాలు తీసేవరకు వెళుతుంది.

Quitting Smoking: చిన్నగా మొదలైన సమస్య ప్రాణాలు తీసేవరకు వెళుతుంది. అందుకే కొన్ని అలవాట్లకి దూరంగా ఉంటే మంచిది. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది చెడు అలవాట్లకి బానిస అవుతున్నారు. అందులో ముఖ్యమైనది సిగరెట్‌ కాల్చడం. తప్పు తెలుసుకున్న తర్వాత చాలామంది ఈ అలవాటుని మానేయాలని అనుకుంటారు. కానీ అంత సులువుగా ఇది జరిగే పనికాదు. దీనికి కారణం కొన్ని పానీయాలకి దూరంగా ఉండకపోవడమే. అవేంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టీ, కాఫీ

టీ, కాఫీ వ్యసనానికి మొదటి మెట్టు. ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే కెఫిన్ అధిక మొత్తంలో ఉంటుంది. టీ లేదా కాఫీని తాగినప్పుడు నికోటిన్ కోరిక మొదలవుతుంది. దీని కారణంగా ధూమపానం మానేయడంలో ఇబ్బంది పడతారు. అందుకే సిగరెట్, పొగాకు మానేయాలనుకుంటే టీ లేదా కాఫీలకి దూరంగా ఉండాలి.

ఆల్కహాల్

ధూమపానం మానేయాలనుకుంటే వెంటనే మద్యానికి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే ఆల్కహాల్ తాగిన తర్వాత చాలామంది ధూమపానం చేస్తారు. కాబట్టి సిగరెట్ మానేయాలని ఆలోచిస్తుంటే ముందు మద్యానికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

చక్కెర ఆహారాలు

ధూమపాన వ్యసనాన్ని విడిచిపెట్టడానికి కొన్ని ఆహారపదార్థాలకి దూరంగా ఉండాలి. ఇందులో స్వీట్ ఫుడ్స్ కూడా ఉంటాయి. ధూమపానం మానేయాలనుకుంటే చాక్లెట్, మిఠాయి వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories