Filtered Water: ఫిల్టర్ వాటర్ తో మూత్ర విసర్జన సమస్య.. అధిగమించాలంటే ఇలా చేయండి..!

Disadvantages Of Filtered Water These Will Reduce Urination Problems
x

Filtered Water: ఫిల్టర్ వాటర్ తో మూత్ర విసర్జన సమస్య.. అధిగమించాలంటే ఇలా చేయండి..!

Highlights

Filtered Water: మనిషి మనుగడకు గాలి, ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం.

Filtered Water: మనిషి మనుగడకు గాలి, ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. మన శరీరంలోని అన్ని భాగాలకు విటమిన్లు, మినరల్స్ ను సరఫరా చేయడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తం తయారు కావడానికి, లాలాజలం, వీర్యం, చీమిడి, కన్నీరు తయారీకి, శరీరంలో జీవరసాయన క్రియలు జరగటానికి, మలిన పదార్థాలను, చెమట, మల,మూత్ర రూపంలో విసర్జించటానికీ నీరు అవసరం. ఒక్కముక్కలో చెప్పాలంటే నీరు లేకుండా మన శరీరంలో ఏ పనులూ జరగవు.

నేటి ఆధునిక జీవన విధానంలో ప్రతిఒక్కటీ కలుషితం అవుతున్నాయి. వీటిలో నీరు కూడా ఉంది. అందుకే, పట్టణాల దగ్గర నుంచి గ్రామాల వరకు అందరూ ఇప్పుడు ఫిల్టర్ వాటర్ నే ఆశ్రయిస్తున్నారు. అయితే ఫిల్టర్లు మెయింటేన్ చేయలేమని కొందరు, ఆర్ ఓ వంటి పరికరాలను పెట్టించుకోలేని మరికొందరు..ఇలా కారణాలు ఏమైనా అందరూ బయట నుంచి క్యాన్ వాటర్ నే తెప్పించుకుంటున్నారు. అయితే ఈ శుద్ధి చేసిన నీటిని వినియోగించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాటర్ పొల్యూషన్ తో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇప్పుడు అందరూ ఫిల్టర్ లేదా ఆర్ ఓ వాటర్ తాగుతున్నారు. అయితే ఈ నీటిలో మినరల్స్ పరిణామాలు చాలా తక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే కాల్షియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ మినరల్ వాటర్ లో ఉండవు. దీంతో ఈ నీటిని తాగడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిల్టర్ వాటర్ తాగేవారిలో ప్రధానంగా మూత్ర విసర్జన సమస్య తలెత్తుతున్నట్లు బయటపడింది.

మూత్ర విసర్జన సమస్యను అధిగమించేందుకు ఆరోగ్య నిపుణులు చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. అదేటంటే, మన రెగ్యులర్ గా వాడుతున్న ఫిల్టర్ వాటర్ లో కాసింత సముద్ర ఉప్పు, నిమ్మకాయ చెక్క, అల్లం ముక్క, పుచ్చకాయముక్క వేసుకొని తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ సమృద్ధిగా అందటమే కాకుండా మూత్ర విసర్జన సమస్యను సైతం అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఫిల్టర్ చేసిన నీరుని ఒక పెద్ద పాత్రలోకి తీసుకొని అందులో సముద్ర ఉప్పు, నిమ్మకాయ, అల్లం ముక్కలు, పుచ్చకాయ ముక్కలను కలిపి రెండు, మూడు గంటల తర్వాత ఆ నీటిని తాగాలి. అలా చేస్తే మూత్ర విసర్జన సమస్యకు చెక్ పడుతుందంటున్నారు. సముద్ర ఉప్పు, నిమ్మకాయ, ఉప్పు, పుచ్చకాయ కలిపితే మన శరీరానికి అవసరమయ్యే ఎలక్ట్రోలైట్స్ లభ్యం అవుతాయంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories