Stomach Problems: కడుపంతా గడబిడ అంటోందా? ఇవి తింటే సమస్య బలదూర్‌..

Stomach Problems
x

Stomach Problems: కడుపంతా గడబిడ అంటోందా? ఇవి తింటే సమస్య బలదూర్‌..

Highlights

Stomach Problems: శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు రావడం, జీవన శైలిలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు రావడం, జీవన శైలిలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట వంటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది మందులను వాడుతుంటారు. సిరప్స్, గ్యాస్‌ ట్రబుల్‌ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవేవి కాకుండా నేచురల్‌ టిప్స్‌తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేయడంలో కొబ్బరి నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతీరోజూ కొబ్బరి బొండం నీరు తాగడం వల్ల కడుపు క్లీన్‌ అవుతుందని అంటున్నారు. కడుపు సంబంధించిన సమస్యలన్నింటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పొటాషియం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉండే అరటి పండును రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండును తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. ఎసిడిటీ సమస్య వచ్చిన వెంటనే అరటి పండు తింటే తక్షణ ఫలితం ఉంటుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తీసుకుంటే ఉదయంసరికి కడుపంతా క్లీన్‌ అవుతుంది. అజీర్ణం సమస్య నుంచి బయటపడొచ్చు. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పెరుగు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సహజసిద్ధమైన ప్రో బయోటిక్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా రోజులో ఒక్కసారైనా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇక సొంపు, జీలకర్ర నీరు కూడా కడుపు సమస్యలకు చెక్‌ పెడుతుంది. రాత్రంతా నానబెట్టిన నీటిని ఉదయాన్నే తీసుకుంటే గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. కడుపు ఉబ్బరం తగ్గి, గడబిడ సమస్య నుంచి బయటపడొచ్చు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories