Health: ఈ సూప్‌లు బరువు తగ్గిస్తాయని మీకు తెలుసా..!

Did You Know That These Soups Help you Lose Weight
x

Health: ఈ సూప్‌లు బరువు తగ్గిస్తాయని మీకు తెలుసా..!

Highlights

Health: బరువు తగ్గించుకోవడానికి చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు.

Health: బరువు తగ్గించుకోవడానికి చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు. కారణం ఏంటంటే వారు ఆహారశైలిలో మార్పులు చేయకపోవడమే. వాస్తవానికి కొన్ని సూప్‌లు తాగడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. ఇది తెలియక చాలామంది బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే బరువు తగ్గించే సూప్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. క్యాబేజీ సూప్‌: క్యాబేజీ సూప్ బరువును తగ్గిస్తుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు K, C, B6, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడుతాయి.

2. గుమ్మడికాయ సూప్: గుమ్మడికాయ సూప్ కూడా బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. గుమ్మడికాయలో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వెజిటేరియన్స్‌కి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

3. చికెన్ సూప్‌: చికెన్ సూప్ బరువు తగ్గిస్తుంది. ముందుగా చికెన్‌ను బాగా ఉడికించాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసి అందులో బే ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. బాగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసి వేడి వేడిగా తీసుకుంటే మంచిది. వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

4. పనీర్, బచ్చలికూర సూప్‌: పనీర్, పాలకూర సూప్ బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాస్తవానికి యాంటీఆక్సిడెంట్లు బచ్చలికూరలో పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి సులువుగా బరువుని తగ్గిస్తాయి.

5. బఠానీ, క్యారెట్ సూప్‌: బఠానీ, క్యారెట్ సూప్ సులువుగా బరువును తగ్గిస్తుంది. నిజానికి ఇందులో విటమిన్-ఎ ఉంటుంది. ఇది కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతోపాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ కూడా బఠానీలలో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి, గుండె సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories