Lifestyle: చల్లటి నీటితో స్నానం చేస్తే వ్యాధులు రావా.? నిపుణులు ఏమంటున్నారు..

Did really immunity will increase if do bath with cold water, Know what expert says
x

Lifestyle: చల్లటి నీటితో స్నానం చేస్తే వ్యాధులు రావా.? నిపుణులు ఏమంటున్నారు..

Highlights

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిజంగానే ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వెంటనే రిఫ్రెష్‌ అవుతుంది.

మనలో చాలా మంది చల్లటి నీటితో స్నానం చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. వేడి నీటితోనే స్నానం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వేడి నీటితో పోల్చితే చల్లటి నీటితో స్నానం చేయడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. చల్లటి నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తుంటారు. చర్మ సంబంధిత సమస్యలు మొదలు ఎన్నో ఇతర సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని అంటుంటారు. ఇక చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిజంగానే ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వెంటనే రిఫ్రెష్‌ అవుతుంది. శరీరానికి ఇన్‌స్టంట్‌ ఎనర్జీ వస్తుంది. చల్లటి నీటితో స్నానం చేసిన వెంటనే ఉల్లాసంగా ఉంటారు. అలాగే చల్లని నీరు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మీ చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎంత టెన్షన్‌, ఒత్తిడి ఉన్నా బలదూర్‌ అవుతుందని చెబుతున్నారు.

అయితే రోగ నిరోధక శక్తి బలపడుతుందా అంటే మాత్రం. కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం కావాలంటే చల్లటి నీటితో స్నానం చేస్తే సరిపోదని. తీసుకునే ఆహారంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బాగా నీరు తాగడం, మంచి నిద్ర ఉండడం వంటివన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి కేవలం చల్లటి నీటితో స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అనడంలో ఎలాంటి నిజం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories