Health News: వీరికి గుండెపోటు వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ.. ఎందుకంటే..?

Diabetic Patients Have 4 Times More Risk of Heart Attack Know the Reasons
x

Health News: వీరికి గుండెపోటు వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ.. ఎందుకంటే..?

Highlights

Health News: ఈ రోజుల్లో గుండెపోటుతో చాలామంది మరణిస్తున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం జీవనశైలి, ఆహార విధానం సరిగ్గా లేకపోవడమే.

Health News: ఈ రోజుల్లో గుండెపోటుతో చాలామంది మరణిస్తున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం జీవనశైలి, ఆహార విధానం సరిగ్గా లేకపోవడమే. ఇది కాకుండా మధుమేహం ఉన్నవారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఈ వ్యాధి కారణంగా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిలో ఈ రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

గుండెపోటు ప్రమాదం

సాధారణ వ్యక్తుల కంటే మధుమేహంతో బాధపడుతున్న రోగులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులకు హై బీపీ, కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వారు ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ గుండెపోటుకు గురవుతారు. డయాబెటిక్ పేషెంట్లలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఎండోథెలియం అని పిలువబడే సిరల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీని కారణంగా గుండెపోటు సమస్యలు ఎదురవుతాయి.

మధుమేహం వల్ల గుండె నరాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. డయాబెటీస్ రోగులకు అధిక LDL కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. మధుమేహం ఉన్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సంభవిస్తుంది. ఇది గుండె జబ్బులను మరింత పెంచుతుంది. ఈ పరిస్థితిలో వారు గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం బీపీని అదుపులో ఉంచుకోవడంతోపాటు కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. రోజువారీ వ్యాయామం చేయాలి. ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.స్ట్రీట్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వంటి కొలెస్ట్రాల్ పెంచే ఆహారం జోలికి పోవద్దు. ప్రతి రెండు మూడు రోజులకోసారి బీపీని చెక్ చేస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories