Diabetes: డయాబెటీస్‌ పేషెంట్లకి ఈ మొలకలు సూపర్..!

Diabetes Patients Must Eat These Sprouts to Control Their Blood Sugar
x

Diabetes: డయాబెటీస్‌ పేషెంట్లకి ఈ మొలకలు సూపర్..! 

Highlights

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఏమి తినాలి.. ఏమి తినకూడదో తరచూ ఆందోళన చెందుతారు.

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఏమి తినాలి.. ఏమి తినకూడదో తరచూ ఆందోళన చెందుతారు. అలాగే బ్లడ్ షుగర్ పెరిగిపోయినప్పుడు చాలా కంగారు పడుతారు. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో మొలకలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను సరిదిద్దుతుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.

మొలకెత్తిన పెసర్లు

మొలకెత్తిన పెసర్లలో చాలా ప్రొటీన్స్‌ ఉంటాయి. వీటిలో విటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. దీంతో పాటు మొలకెత్తిన పెసర్లలో ఫైబర్, ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది.

మొలకెత్తిన సోయాబీన్

మొలకెత్తిన సోయాబీన్ చాలా మందికి నచ్చదు. ఎందుకంటే వీటి రుచి కొంచెం చేదుగా ఉంటుంది. అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయాబీన్‌లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. ఇవి కడుపుతో పాటు గుండెకు చాలా మేలు చేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ తినవచ్చు.

మొలకెత్తిన శెనగలు

మొలకెత్తిన శనగల గురించి అందరికీ తెలుసు. వీటిని దాదాపు ప్రతి ఇంట్లో సలాడ్‌గా లేదా బెల్లంతో కలిపి తింటారు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే రోజూ మొలకెత్తిన శెనగలని తినాలి. ఇందులో కార్బ్ తక్కువగా ఉంటుంది. అలాగే ప్రొటీన్ల నిష్పత్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories