Fridge Maintenance: ఫ్రిజ్‌కి సంబంధించి ఈ పని చేస్తున్నారా.. లేదంటే కరెంట్‌ బిల్‌ పెరుగుతుంది..!

Defrost The Fridge Once In Every 10 Days Otherwise The Current Bill Will Increase
x

Fridge Maintenance:ఫ్రిజ్‌కి సంబంధించి ఈ పని చేస్తున్నారా.. లేదంటే కరెంట్‌ బిల్‌ పెరుగుతుంది..!

Highlights

Fridge Maintenance: మానవ జీవితంలో ఫ్రిడ్జ్‌ అనేది ఒక ముఖ్య భాగంగా మారింది. మొదట్లో దీని వాడకం నగరాలకే పరిమితం కానీ నేటి రోజుల్లో ఇది గ్రామాలకి కూడా విస్తరించింది.

Fridge Maintenance: మానవ జీవితంలో ఫ్రిడ్జ్‌ అనేది ఒక ముఖ్య భాగంగా మారింది. మొదట్లో దీని వాడకం నగరాలకే పరిమితం కానీ నేటి రోజుల్లో ఇది గ్రామాలకి కూడా విస్తరించింది. దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉంటుంది. ఇది కూరగాయలు, ఆహార పదార్థాలని తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా అనేక ఇతర అవసరాలకి ఉపయోగపడుతుంది. ఫ్రిడ్జ్‌లో సింగిల్‌ డోర్‌, డబుల్‌ డోర్‌ రకాలు ఉంటాయి. అయితే ఇప్పటీకి దీని మెయింటనెన్స్‌ గురించి చాలా మందికి తెలియదు. సింగిల్ డోర్ ఫ్రిజ్‌లో ఒక బటన్‌ కనిపిస్తుంది. చాలామంది దీనిని నొక్కడానికి భయపడతారు. ఈ బటన్ ఫ్రిజ్‌కి చాలా సహాయం చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రతి 10 రోజులకి డీఫ్రాస్టింగ్

ప్రతి పది రోజులకి సింగిల్ డోర్ ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయడం అవసరం. ఎందుకంటే ఇది ఫ్రిజ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఫ్రిజ్‌లో మంచు పేరుకుపోవడం వల్ల కూల్‌నెస్‌ సామర్థ్యం దెబ్బతింటుంది. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ అధిక విద్యుత్తును వినియోగిస్తుంది. ఆహార పదార్థాలను చల్లగా ఉంచలేదు. అయితే మంచు పేరుకుపోయినప్పుడు చాలామంది ఫ్రిజ్‌ని ఆఫ్ చేస్తారు కానీ డీఫ్రాస్ట్ బటన్ నొక్కరు.

డీఫ్రాస్ట్‌ బటన్‌ ఉపయోగం

రిఫ్రిజిరేటర్లలో డీఫ్రాస్ట్ బటన్ ఉంటుంది. ఇది మంచును కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఒక్కసారి నొక్కడం వల్ల ఫ్రిజ్ డీఫ్రాస్ట్ అవుతుంది. తర్వాత ఫ్రిజ్‌ను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్రిజ్‌లో ఈ బటన్ ఉన్నప్పటికీ చాలామంది దీనిని ఉపయోగించరు. ప్రతి పది రోజులకు ఫ్రిజ్‌ని డీఫ్రాస్ట్ చేయకుంటే ఫ్రిజ్‌లోని శక్తి సామర్థ్యం తగ్గుతుంది. దీని ఫలితంగా రిఫ్రిజిరేటర్ చల్లగా ఉంచడానికి చాలా కష్టపడాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా విద్యుత్‌ని ఎక్కువగా వినియోగిస్తుంది. దీంతో కరెంట్‌ బిల్‌ పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories