Vitamin D: విటమిన్‌ డి లోపిస్తే చాలా ప్రమాదం.. ఈ జబ్బుల బారిన పడుతారు..!

Deficiency of Vitamin D is Very Dangerous you will be Affected by These Diseases
x

Vitamin D: విటమిన్‌ డి లోపిస్తే చాలా ప్రమాదం.. ఈ జబ్బుల బారిన పడుతారు..!

Highlights

Vitamin D: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా పోషకాలు అవసరం.

Vitamin D: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా పోషకాలు అవసరం. లేదంటే జబ్బుల బారినపడే అవకాశాలు ఉంటాయి. పోషకాల లోపం వల్ల చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు విటమిన్స్‌లోపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 'విటమిన్ డి' లోపిస్తే చాలా ప్రమాదం. రోగనిరోధక శక్తి తగ్గిపోయి శరీరం రోగాలమయం అవుతుంది. ఎముకలకు అతి పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఎముకలు విరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల నీరసం, అలసట, చిరాకు అనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ డి కోసం ఎండలో ఉండాలి. ఎందుకంటే సూర్యరశ్మి విటమిన్‌ డి లోపాన్ని తీరుస్తుంది. మన శరీరానికి రోజూ 600 UI విటమిన్ డి అవసరమవుతుంది. ఎండలో కూర్చోవడమే కాకుండా ఆహారం వల్ల కూడా ఈ పోషకాన్ని పొందవచ్చు. విటమిన్ డి పొందే కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతి రోజు కనీసం అరగంట సేపు ఎండలో గడపాలి. శాఖాహారం తీసుకునే వారు ఆవు పాలు, ఆరెంజ్ జ్యూస్, తృణధాన్యాలు, మష్రూమ్ సలాడ్‌లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

మీరు మాంసాహారులైతే గుడ్డులోని పచ్చసొన, సాల్మన్, ట్యూనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే లివర్ కర్రీ తిన్నా విటమిన్ డి అందుతుంది. శాకాహారిగా ఉండే వారికి ఆహార ఎంపికలు చాలా తక్కువ. బాదం పాలు, సోయా పాలు తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎండలో కొద్దిసేపు వ్యాయామం చేయాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు తప్పనిసరిగా ఉదయం ఎండలో గడపాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories