Health Tips: ఈ విటమిన్‌ లోపం వల్ల ఎముకల నొప్పి అలసటకి గురవుతారు.. జాగ్రత్త..!

Deficiency of Vitamin D in the Body Causes Bone Pain and Fatigue
x

Health Tips: ఈ విటమిన్‌ లోపం వల్ల ఎముకల నొప్పి అలసటకి గురవుతారు.. జాగ్రత్త..!

Highlights

Health Tips: శరీరంలో ఒక విటమిన్‌ లోపిస్తే ఎముకల నొప్పి, అలసటకి గురవుతారు.

Health Tips: శరీరంలో ఒక విటమిన్‌ లోపిస్తే ఎముకల నొప్పి, అలసటకి గురవుతారు. ఈ విటమిన్‌ డి. ఇది లోపిస్తే శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా అందే పోషకం. ఇది కొన్ని ఆహారం, పానీయాలలో కూడా ఉంటుంది. దీనిని సన్‌షైన్ విటమిన్ అంటారు. చాలా మంది వ్యక్తులు సూర్యరశ్మిని నివారించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇది వారి చర్మాన్ని పాడు చేస్తుందనుకుంటారు. కానీ ఈ సూర్యకాంతి వారికి విటమిన్ డి లోపాన్ని తీరుస్తుంది.

1. ఎముకల నొప్పి

శరీరంలో ఎముకల పటిష్టతకు కాల్షియంతోపాటు విటమిన్ డి అవసరం. ఈ పోషకం లోపం ఉంటే శరీరం కాల్షియం సరిగ్గా గ్రహించదు. దీని కారణంగా ఎముకలు, దంతాలు, శరీరంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. మీరు త్వరగా అలసిపోవడం ప్రారంభిస్తారు.

2. గాయం మానడానికి సమయం

సాధారణంగా ఒక గాయం ఏర్పడితే అది కొన్ని రోజుల్లో నయమవుతుంది. కానీ గాయం మానకుండా ఎక్కువ రోజులు వేధిస్తే మీ శరీరంలో విటమిన్ల కొరత ఉందని అర్థం చేసుకోండి. విటమిన్‌ డి మంట, చికాకును నివారించడంలో సహాయపడే పోషకం.

3. మానసిక ఆరోగ్యం

మన మనస్సు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీరం పూర్తిగా ఫిట్‌గా ఉంటుంది. మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లయితే ముందుగానే డిప్రెషన్‌కు గురవుతారు. అనేక ధ్రువ దేశాలలో సూర్యకాంతి 6 నెలల వరకు అందదు. అక్కడి ప్రజలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. వాస్తవానికి సూర్యరశ్మి మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories