Health Tips: ఈ విటమిన్ల లోపం కారణంగా కంటిచూపు మందగిస్తుంది.. అవేంటంటే..?

Deficiency Of These Vitamins Can Cause Blurred Vision Eat These Foods For Sure
x

ఈ విటమిన్ల లోపం కారణంగా కంటిచూపు మందగిస్తుంది.. అవేంటంటే..?

Highlights

* దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ చిన్న వయస్సులోనే కళ్లు మసకబారితే అది ఆందోళన కలిగించే విషయం.

Health Tips: వృద్ధాప్యంతో కంటి చూపు కోల్పోవడం సహజమైన ప్రక్రియ. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ చిన్న వయస్సులోనే కళ్లు మసకబారితే అది ఆందోళన కలిగించే విషయం. శరీరంలో చాలా ముఖ్యమైన పోషకాల లోపం ఉందని అర్థం. సాధారణంగా 4 విటమిన్ల లోపం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఏం తినాలో ఈ రోజు తెలుసుకుందాం.

విటమిన్-సి లోపం ఉండకూడదు

కంటి చూపును బలోపేతం చేయడానికి విటమిన్ సి మెరుగైన పోషకంగా చెబుతారు. జామ, ఉసిరి, అరటి, నారింజ, నిమ్మ వంటి పండ్లని తీసుకోవడం ద్వారా ఈ పోషకాన్ని పొందవచ్చు. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల క్రమంగా కంటి చూపు బలపడటం మొదలవుతుంది. అస్పష్టమైన దృష్టి సమస్య తొలగిపోతుంది.

విటమిన్ ఈ

విటమిన్ ఈ కంటి నరాలను బలపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాల్మన్ చేపలు, అవకాడో, గింజలు లేదా ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఈ విటమిన్ పొందవచ్చు.

ఆకు కూరలు

కళ్ళు అస్పష్టంగా ఉన్నట్లు సమస్య ఉంటే అది విటమిన్ బి లోపం వల్ల సంభవిస్తుంది. ఇందులో విటమిన్-బి6, బి9, బి12 ఉంటాయి. పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, బీన్స్, గింజలు, మాంసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ విటమిన్లన్నింటినీ తిరిగి పొందవచ్చు.

విటమిన్-ఎ లోపం

మన శరీరంలో కంటి చూపుకు విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది. ఇది కళ్ల బయటి పొరను రక్షిస్తుంది. ఈ పోషకం లోపం వల్ల రేచీకటి ఏర్పడుతుంది. దీని వల్ల రాత్రిపూట కళ్లు కనిపించవు. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే క్యారెట్, బత్తాయి, గుమ్మడి, బొప్పాయి, పచ్చి ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories