Potassium Deficiency: శరీరంలో పొటాషియం తగ్గడానికి కారణాలేంటి.. తగ్గితే ఏమవుతుంది..!

Deficiency of Potassium can lead to Fatigue Constipation and stress Problems add these to your Diet at this Time
x

Potassium Deficiency: శరీరంలో పొటాషియం తగ్గడానికి కారణాలేంటి.. తగ్గితే ఏమవుతుంది..!

Highlights

Potassium Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. లేదంటే ఏదో ఒక వ్యాధి చుట్టుముడుతుంది.

Potassium Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. లేదంటే ఏదో ఒక వ్యాధి చుట్టుముడుతుంది. ధీర్ఘకాలం గుర్తించపోతే మనిషి ప్రమాదంలో పడుతాడు. అందుకే అన్నింటిని సమానంగా మెయింటెన్‌ చేయాలి. విటమిన్లు ఖనిజాలలో పొటాషియం ఒకటి. చాలామంది దీనిని విస్మరిస్తారు. కానీ ఇది కూడా శరీరానికి అత్యవసరం. పొటాషియం శరీరంలోని నీటి సమతుల్యతను అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఖనిజం మానసిక ఒత్తిడి, నరాల పనితీరుకు అవసరమవుతుంది.

పొటాషియం ఎందుకు తగ్గుతుంది?

తక్కువ పొటాషియం స్థాయికి అనేక కారణాలు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ తీసుకోవడం, అతిసారం, వాంతులు, అధిక చెమట, శరీరంలో ఫోలిక్ ఆమ్లం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. వీటివల్ల మీరు ఇబ్బంది పడినట్లయితే శరీరంలో పొటాషియం లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో అన్ని వేళలా నీరసం, అలసట, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు ఉంటే శరీరంలో పొటాషియం లోపం ఉందని అర్థం.

తరచుగా మూత్రవిసర్జన

తరచుగా మూత్రవిసర్జన పొటాషియం లోపానికి సంకేతం. దీనితో పాటు ఎప్పుడూ మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఉంటే శరీరంలో పొటాషియం లోపిస్తుందని అర్థం. జీర్ణక్రియ సరిగా లేకుంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. చాలా సార్లు ఆహారపు అలవాట్ల వల్ల ఇలా జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే అది శరీరంలో పొటాషియం తక్కువగా ఉందనడానికి సంకేతమని చెప్పవచ్చు.

కండరాలు ఆకస్మిక, అనియంత్రిత సంకోచం రక్తంలో పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది. సాధారణంగా ఏదో ఒక అవయవంలో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల జలదరింపు వస్తుంది. మీరు ఎటువంటి కారణం లేకుండా చేతులు లేదా కాళ్లలో జలదరింపు లక్షణాన్ని అనుభవిస్తే, చర్మం తిమ్మిరిగా మారినట్లయితే అది శరీరంలో పొటాషియం లోపానికి సంకేతమని గుర్తించండి.మెదడు ఆరోగ్యంగా ఉంచడంలో పొటాషియం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గందరగోళం, ఆకస్మిక నిరాశ, మానసిక ఒత్తిడి అనుభవిస్తే శరీరంలో పొటాషియం లోపం ఉందని సూచన. పొటాషియం లోపాన్ని ఐదు ఆహారాల ద్వారా తిరిగి పొందవచ్చు.

1- పాలకూర, ఆకుకూరలు

2- అవకాడో

3- కొబ్బరి నీళ్లు

4- అరటిపండు

5- గుమ్మడికాయ గింజలు

Show Full Article
Print Article
Next Story
More Stories