World AIDS Day 2024 : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం..2024 థీమ్ ఇదే..చికిత్స లేని వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
World AIDS Day 2024 : ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడంతోపాటు వ్యాప్తిని నివారించేందుకు ప్రతిఏటా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం...
World AIDS Day 2024 : ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడంతోపాటు వ్యాప్తిని నివారించేందుకు ప్రతిఏటా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్ ఏంటో చూద్దాం.
ప్రపంచ ఎయిడ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్1 వ తేదీన నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చికిత్స లేని ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పిస్తూ ఈ తేదీన జరుపుకుంటున్నారు. ఎయిడ్స్ ( అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ ) సమాజంపై కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో హెచ్ఐవీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం దీని లక్ష్యం. అసలు ఎయిడ్స్ ప్రభావమేంటీ ..ఈ ఎయిడ్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు అవసరం. దీని చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ గురించి తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తగా 2023లో 13లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. ఇండియాలో 66,400 కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి. నమోదు కానీ కేసులు ఎన్నో ఉన్నాయి. UNAIDS ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 38.4 మిలియన్ల మంది HIVఎయిడ్స్ తో ఇబ్బందిపడుతున్నారని తెలిపింది. అదే ఏడాదిలో 1.5 మిలియన్ల కొత్త ఇన్ఫెక్షన్స్ గుర్తించారు. సుమారు 6,50,000 మంది ఈ వ్యాధితో మరణించారు.
అయితే ఒకప్పుడు ఎయిడ్స్ ను నియంత్రించలేని పరిస్థితి. సరైన చికిత్స లేదు. దాన్ని నియంత్రించడమే మన ముందున్న అతిపెద్ద టాస్క్ గా మారింది. ఈ అవసరాన్ని గుర్తించి ప్రతి ఏడాది ఈ ఎయిడ్స్ డే ను నిర్వహిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధిని ఎలా గుర్తించాలని రోగనిర్ధారణ నిర్వహణ, అంటు వ్యాధి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు.
ఈ సంవత్సరం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 థీమ్ "టేక్ ద రైట్స్ పాత్: మై హెల్త్, మై రైట్!" సామాజిక అడ్డుకులను తొలగించడం దీని లక్ష్యం. హెచ్ఐవీ ఉన్న వ్యక్తులకు సామాజిక మద్ధతు అందించాలన్న థీమ్ తో ముందుకు వెళ్తున్నారు. సామాజికంగా ఎయిడ్స్ ఉన్నవారికి వెలివేయడం వంటివి చేయకుండా వారి హక్కులను గుర్తిస్తూ నియంత్రణ చర్యలు తీసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఎయిడ్స్ నివారించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. పరిశోధనలకు అంతగా ఆశించిన ఫలితాలు కూడా రావట్లేదు. కాబట్టి చికిత్స లేని ఈ మహమ్మారిని నివారించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రొటెక్షన్స్ ఉపయోగించడం, సెక్సువల ట్రాన్స్ మిట్టెడ్ డీసీసీ పరీక్షలు చేయించుకోవడం, హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం వంటి చేస్తుండాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire