Hair Care Tips: చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుందా.. ఈ మార్గాల్లో వదిలించుకోండి..!

Dandruff Is Bothering You Follow These Tips And Get Rid Of It
x

Hair Care Tips: చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుందా.. ఈ మార్గాల్లో వదిలించుకోండి..!

Highlights

Hair Care Tips: చలికాలం వచ్చేసిందంటే చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంది. మెడపై, దుస్తులపై పడుతూ ఇబ్బందిని కలిగిస్తుంది.

Hair Care Tips: చలికాలం వచ్చేసిందంటే చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంది. మెడపై, దుస్తులపై పడుతూ ఇబ్బందిని కలిగిస్తుంది. చాలా మంది దీనిని పోగొట్టుకోవడానికి రసాయన ఆధారిత యాంటీ డాండ్రఫ్ షాంపూని ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టు మొత్తం పాడవుతుంది. అయితే సహజసిద్దమైన చిట్కాల ద్వారా చుండ్రుని పూర్తిగా తొలగించవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రుకు కారణమైన ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ సమాన భాగాలుగా కలపాలి. ఈ ద్రావణాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. కడిగే ముందు 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఇది మీ స్కాల్ప్ pHని సమతుల్యం చేయడంతో పాటు చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. చుండ్రుకు అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. మీ రెగ్యులర్ షాంపూకి కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. లేదా క్యారియర్ ఆయిల్‌తో కరిగించి నేరుగా తలకు అప్లై చేయండి. కడిగే ముందు కొన్ని నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగితే చుండ్రు కనిపించదు.

3. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్. ఇది తలపై పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను వేడి చేసి తలపై మసాజ్ చేయాలి. జుట్టు కడగడానికి ముందు కొన్ని గంటలు లేదా రాత్రిపూట కొబ్బరినూనె పెట్టుకోవాలి. రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల స్కాల్ప్ హెల్త్ మెరుగుపడుతుంది. చుండ్రు తగ్గుతుంది.

4. అలోవెరా

కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఇరిటేషన్, చుండ్రును తగ్గిస్తాయి. దీని కోసం తాజా కలబంద జెల్‌ను నేరుగా తలపై అప్లై చేసి 30 నిమిషాలు ఉంచి ఆపై కడిగేయాలి. ఇది దురద, ధూళిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories