Corona Effect: పురుషుల లైంగిక జీవితంపై కరోనా ఎఫెక్ట్‌.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

Corona Effect on Mens Sex Life Shocking Facts in the Study
x

Corona Effect: పురుషుల లైంగిక జీవితంపై కరోనా ఎఫెక్ట్‌.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

Highlights

Corona Effect: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోయారు.

Corona Effect: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోయారు. అయితే నయమైనవారిలో అనేక దుష్ప్రభావాలు వెలుగులోకి వస్తున్నాయి. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా ఓ కొత్త అధ్యయనంలో షాకింగ్‌ నిజం తెలిసింది. ఇందులో కోవిడ్‌ సోకిన పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం పడినట్లు తేలింది. వైరస్ పురుషుల వీర్యం నాణ్యతని దెబ్బతీస్తోంది. ఈ అధ్యయనం క్యూరియస్ జర్నల్ ఆఫ్ మెడికల్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో కరోనా సోకిన పురుషుల వీర్యం పరీక్షించారు. ఇందులో కోవిడ్ తర్వాత వీర్యం నాణ్యత తక్కువగా ఉందని తేలింది. ఢిల్లీ, పాట్నా, మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ఈ అధ్యయనం చేసింది. ఇందులో 19 నుంచి 43 ఏళ్ల మధ్య వయసున్న 30 మంది పురుషులు పాల్గొన్నారు. వీరందరికీ కోవిడ్‌ సోకింది. మొదటి స్పెర్మ్ టెస్ట్ ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే చేశారు. రెండున్నర నెలల తర్వాత రెండో టెస్టు చేశారు. అప్పుడు వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

అధ్యయనం ప్రకారం మొదటి పరీక్షలో 40 శాతం మంది పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ వచ్చింది. రెండున్నర నెలల తర్వాత రెండోసారి పరీక్ష చేయగా ముగ్గురు పురుషుల వీర్యం నాణ్యత చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న 30 మంది పురుషులలో 26 మంది స్పెర్మ్ కౌంట్ బాగా లేదు. అయితే 22 మంది స్పెర్మ్ కదలిక చాలా నెమ్మదిగా ఉంది. రెండున్నర నెలల తర్వాత పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ సాధారణ స్థితికి రాలేదు.

వైద్యుల ప్రకారం పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే అది వారి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో పురుషుడి లైంగిక జీవితం ప్రభావితమవుతుంది. కరోనా కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. 10 వారాల తర్వాత కూడా కోవిడ్ ప్రభావం వీర్యంపై ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ శరీరంలోని ప్రతి భాగాన్ని వాటి పనితీరును ప్రభావితం చేస్తోంది. గత కొన్నేళ్లుగా కోవిడ్‌కు సంబంధించి పురుషుల లైంగిక జీవితంపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories