Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ మసాల గింజలు ఒక వరం.. అవేంటంటే..?

Coriander Seeds is a Boon for Diabetic Patients Keeps Blood Glucose Levels Under Control
x

Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ మసాల గింజలు ఒక వరం.. అవేంటంటే..?

Highlights

Health Tips: నేటి కాలంలో చాలామంది డయాబెటీస్‌తో బాధపడుతున్నారు.

Health Tips: నేటి కాలంలో చాలామంది డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటున్నారు. దీంతో భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీనికి కారణం క్షీణిస్తున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. అయితే మధుమేహ రోగులు వంటగదిలో ఉండే ఒక మసాల దినుసుని వాడటం వల్ల కొంచెం ఉపశమనం పొందవచ్చు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వంటగదిలో దొరికే ధనియాలు అద్భుతమైన మసాల దినుసు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా డయాబెటిస్‌తో బాధపడుతుంటే వారు కచ్చితంగా కఠినమైన డైట్ పాటించాలి. కానీ ధనియాలని తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ అవుతాయి. ధనియాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే మధుమేహ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి.

ధనియాలని ఎక్కువగా కూరలలో ఉపయోగిస్తారు. ఇది వంటకాల రుచిని పెంచుతుంది. ఈ మసాలా దినుసు తినడం ద్వారా శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు అందుతాయి. డయాబెటిక్ రోగులు రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో కొన్ని ధనియాలని నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories