Clove Side Effects: ఔషధాల నిధి లవంగం.. కానీ ఈ సమస్యలున్నవారికి హాని..!

Clove is a Treasure of Medicines but People with these Health Problems should not take it
x

Clove Side Effects: ఔషధాల నిధి లవంగం.. కానీ ఈ సమస్యలున్నవారికి హాని..!

Highlights

Clove Side Effects: లవంగం ఒక అద్భుతమైన మసాలా దినుసు. ఇందులో పెద్ద మొత్తంలో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

Clove Side Effects: లవంగం ఒక అద్భుతమైన మసాలా దినుసు. ఇందులో పెద్ద మొత్తంలో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పూర్వకాలం నుంచి దీనిని వాడుతున్నారు. ఆయుర్వేద మందుల తయారీలో కూడా వినియోగిస్తారు. లవంగం రుచి హాట్‌గా ఉంటుంది. దీన్ని పులావ్, బిర్యానీ, మటన్‌, చికెన్ వంటి వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వంటకాల రుచిని మరింత పెంచుతుంది. అలాగే లవంగాలతో మసాలా టీ తయారుచేస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తుంది. లవంగాల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. వాటిని ఎక్కువగా తింటే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటికి దూరంగా ఉండాలి.

మెదడుపై ప్రభావం

లవంగాలలో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. దీనిని పరిమితంగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత ఏర్పడుతాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలుంటే లవంగాలు తినడం మానుకోవడం ఉత్తమం. లేదంటే సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.

మౌత్ అల్సర్

నోటిపూత వస్తే ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించలేరు. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ పరిస్థితిలో నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం సమస్యలు తలెత్తుతాయి.

అజీర్ణ సమస్య

లవంగాల వినియోగాన్ని నియంత్రించుకోని వ్యక్తులు అనేక రకాల కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, అతిసారం, వాంతులు వంటి సమస్యలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి లవంగాలను పరిమితంగా ఉపయోగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories