Health Tips: ఆకుకూరలు వండేముందు ఇలా క్లీన్‌ చేయండి.. లేదంటే పెను ప్రమాదం..!

Clean The Greens In These Ways Before Cooking Them Otherwise You Will Suffer From Health Problems
x

Health Tips: ఆకుకూరలు వండేముందు ఇలా క్లీన్‌ చేయండి.. లేదంటే పెను ప్రమాదం..!

Highlights

Health Tips: ఆకుకూరలు వండేముందు ఇలా క్లీన్‌ చేయండి.. లేదంటే పెను ప్రమాదం..!

Health Tips: ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే వీటివల్ల శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని వండడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలానష్టం జరుగుతుంది. ఆకుకూరలపై అనేక కీటకాలు, సాలెపురుగులు,చిమ్మటలు పేరుకుపోయి ఉంటాయి. వీటిని తొలగించడం చాలా ముఖ్యం. లేదంటే అనేక వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయి. వీటిని ఏ విధంగా శుభ్రం చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

ఆకుకూరల శుభ్రం ఎందుకు..?

ఆకుకూరలలో కీటకాలు, తెగుళ్లు కాకుండా మరో సమస్య దాగి ఉంది. వీటి పెరుగుదల సమయంలో ఉపయోగించే పురుగుమందులు. ఇవి ఆహారంలో చేరినట్లయితే శరీరానికి చాలా హాని జరుగుతుంది. అందుకే హానికరమైన పురుగుమందులు నీళ్లతో కొట్టుకుపోయేలా ఆకుకూరలను శుభ్రం చేయాలి.

చేతులతో శుభ్రపరచండి

అన్నింటిలో మొదటిది చేతులతో ఆకుకూరలను శుభ్రం చేయాలి. వాటిపై పేరుకుపోయిన మట్టిని, కీటకాలను పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించాలి. ఈ రకమైన మాన్యువల్ క్లీనింగ్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

వేడి నీటిని వాడండి

ఆకుకూరలని వేడినీటిలో వేసి శుభ్రం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కీటకాలు, పురుగుమందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి బయటపడతారు.

బేకింగ్ సోడా వాడకం

మీరు కూరగాయలు కడగడానికి బేకింగ్‌ సోడాని ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసి ఆపై ఆ పాత్రలో ఆకుకూరలను ముంచి నీటితో శుభ్రం చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories