Cinnamon Water: షుగ‌ర్‌కి మంచి విరుగుడు దాల్చిన‌చెక్క వాట‌ర్‌..!

Cinnamon Water is a Good Antidote to Diabetes
x

దాల్చిన చెక్క వాటర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Cinnamon water: దాల్చిన చెక్క ఒక సాధారణ మసాలా. రుచి, వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

Cinnamon water: దాల్చిన చెక్క ఒక సాధారణ మసాలా. రుచి, వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ప్రాచీన మసాలా దినుసును ఒక గ్లాసు నీటిలో చిటికెడు కలిపి తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అమృతం లాంటిది. షుగర్‌ను నియంత్రించడానికి దాల్చిన చెక్కను తినమని వైద్యులు కూడా రోగులకు సలహా ఇస్తారు.

దాల్చిన చెక్క నీరు ఎందుకు?

దాల్చినచెక్క ముఖ్యంగా ఆరోగ్యానికి, శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన‌ది. ఈ మసాలా అనేక వ్యాధులకు చికిత్స చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌నాత‌న ఆయుర్వేద కాలం నుంచి దీనిని ఔష‌ధాల‌లో వాడుతున్నారు. దాల్చిన చెక్కలను నీటిలో ఉంచడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌తో పాటు అదనపు చక్కెరను కూడా బయటకు పంపుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా వేడి నీటిలో దాల్చిన చెక్కను క‌ల‌ప‌డం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు కరిగిపోతుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాల‌ను నివారిస్తుంది.

మధుమేహం కోసం దాల్చిన చెక్క

ఒక పరిశోధన ప్రకారం ప్రతిరోజూ మీ ఆహారంలో కేవలం 1 గ్రాము దాల్చిన చెక్కను క‌ల‌ప‌డం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. దాల్చినచెక్కలోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో కొద్ది మొత్తంలో దాల్చినచెక్కను తీసుకోవ‌డం వల్ల మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడం, టాక్సిన్స్‌ను బయటకు పంపడం, బాగా నిద్రపోవడం, జీవక్రియను పెంచడం వంటివి చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories