Cinnamon Tea: దాల్చిన చెక్క టీ... ఉపయోగాలు

Cinnamon Tea Health Benefits
x

దాల్చిన చెక్క టీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Cinnamon Tea: మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది.

Cinnamon Tea: చాలా మందికి టీ తాగందనే పూటగడవదు. మరి కొంత మంది రోజుకు ఎన్ని సార్లు తాగుతారో లెక్కవుండదు. ఏదైనా ఒక క్రమ పద్దతిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచింది. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అస్సలు విషయమేంటంటే మీరు చాలా రకాల టీలను చూసి, చేసి, టేస్టు చేసి వుంటారు. కానీ దాల్చిన చెక్క టీ గురించి ఇవాళ మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ మందికి నచ్చేవాటిలో దాల్చిన చెక్క ఒకటి. కొంతమంది దాన్ని మసాలాలలో కాకుండా... విడిగా కూడా తింటుంటారు. దాని పరిమళం, టేస్ట్ అంతలా ఆకట్టుకుంటుంది. దాల్చిన చెట్టు లోపలి బెరడునే దాల్చిన చెక్క అంటాం. చెట్టు నుంచీ తీశాక అది గుండ్రంగా చుట్టుకొని గొట్టాలలాగా మారిపోతుంది. వాటినే సిన్నమోన్ స్టిక్స్ (దాల్చిన చెక్కలు) అంటారు. వాటిని అలాగే నీటిలో ఉడకపెడతారు లేదా పౌడర్‌గా చేసుకొని... టీ తయారు చేయవచ్చు.

దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుతుంది. ఓవరాల్‌గా గుండెకు హాని జరగకుండా చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపుకి చెక్ పెట్టాలన్నా సిన్నమోన్ టీ తాగాల్సిందే. అలాగే... ఎయిడ్స్‌కి కారణమయ్యే HIV వైరస్‌తో పోరాడే శక్తి కూడా దాల్చిన చెక్కకు ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది. రోజూ 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్కతో (చెక్క లేదా పౌడర్) (టీ స్పూన్‌లో పదో వంతు పొడి)... ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ఈ టీని వేడిగా, చల్లగా ఎలా తాగినా అవే ప్రయోజనాలు కలుగుతాయి

దాల్చిన చెక్క టీ తయారుచేసే విధానం

ఓ కప్పు వేడి నీటిలో (235 ml వాటర్) ఓ టీ స్పూన్ (2.6 గ్రాములు) దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగేయడమే. లేదంటే... దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10 నుంచీ 15 నిమిషాలు ఉంచి... ఆ నీరు తాగినా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో సిన్నమోన్ టీ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని తాగినా ప్రయోజనం ఉంటుంది.

రుచి బాగుంది కదా అని ఎక్కువ తాగడం మంచిది కాదు. ఇవి రోజుకి రెండు కంటే ఎక్కువ కప్పులు తాగకూడదు. సో ఇంకెందుకు మన రోజు వారీ టీలలో దాల్చిన చెక్క టీను కూడా చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories