Health Tips: కిచెన్‌లో ఉండే ఈ మూలికతో కొలస్ట్రాల్‌కి చెక్.. స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించుకోండి..

Cinnamon in the Kitchen Reduces Cholesterol Prevents the Risk of Stroke
x

Health Tips: కిచెన్‌లో ఉండే ఈ మూలికతో కొలస్ట్రాల్‌కి చెక్.. స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించుకోండి..

Highlights

Health Tips: కిచెన్‌లో ఉండే ఈ మూలికతో కొలస్ట్రాల్‌కి చెక్.. స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించుకోండి..

Health Tips: శరీరంలో మంచి,చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా రక్త ప్రసరణలో సమస్య ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడి రక్తంలో ప్రవహిస్తూ మెదడులోని నాళాల్లో నిక్షిప్తం అవుతాయి. దీని కారణంగా స్ట్రోక్ సంభవిస్తుంది. కొన్నిసార్లు మెదడు రక్తనాళాలు మూసుకుపోతాయి. మరికొన్ని సార్లు ఈ నాళాలు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అయితే వంటగదిలో లభించే ఒక మూలిక చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం.

శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. దీనికి ఉత్తమ మార్గం సరైన ఆహారం తీసుకోవడమే. వంటగదిలో లభించే దాల్చిన చెక్క శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. దాల్చినచెక్క అనేక ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి వినియోగిస్తారు. ఒక పరిశోధన ప్రకారం దాల్చిన చెక్క పొడి LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.

దాల్చిన చెక్క ప్రయోజనాలు

శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడం వల్ల మెదడు రక్తస్రావం, గుండెపోటు, స్ట్రోక్‌తో సహా అనేక సమస్యల ప్రమాదం తగ్గుతుంది. దాల్చిన చెక్క సీజనల్ వ్యాధులపై కూడా ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories