Cinnamon Benefits: దాల్చిన చెక్కతో అధిక బరువుకు చెక్

Cinnamon Benefits Human Beings by Reducing Cholesterol
x

ఫైల్ ఇమేజ్


Highlights

Cinnamon Benefits: రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట.

Cinnamon Benefits: మనందరికీ తెలిసిన దినుసు, అందరికీ అందుబాటులో వుంటుంది. అదేనండి మన ఇంట్లో వుండే మసాలా దినుసుల్లో ఒకటి దాల్చిన చెక్క.మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించలేము కదా.. కొంచెం వగరుగా, ఘాటుగా, కొంచెం తియ్యగా ఉండే దాల్చిన చెక్కలో రోగాలను నయం చేసే ఎన్నో సుగుణాలున్నాయి. వంటకాల్లో సువాసన కోసం వాడే దాల్చిన చెక్క మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. దాల్చిన చెక్క చెట్టులోని దాదాపు ప్రతి భాగమూ ముఖ్యమైనదే.. దాల్చిన చెక్క ఎక్కువగా కేరళతో పండుతుంది. అయితే దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలున్నాయట. మరి ఇన్ని సుగుణాలున్న ఆ దాల్చిన చెక్క గురించి ఇవాల్టి మన హెచ్ ఎం టివి "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందా....

  • లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. దీంతో శరీరంలో షుగర్ లెవల్స్ అదుపు తెస్తుంది. అంతే కాదు దానిలో వుండి క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతూ శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని స్థిరంగా వుంచడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.
  • దాల్చిన చెక్క ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తప్రసరణలో కలిగే ఆటంకాలు తొలగిస్తుంది. కడుపునొప్పి సమస్య ఉన్నవాళ్లు పది గ్రాముల దాల్చిన చెక్కపొడి, పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
  • కడుపునొప్పి సమస్య ఉన్నవాళ్లు పది గ్రాముల దాల్చిన చెక్కపొడి, పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.దాల్చిన చెక్క శరీరంలోని చెడు కొవ్వులని క్రమంగా తగ్గించి మంచి కొవ్వుల స్థాయిని పెంచుతుంది.
  • షుగర్ తో బాధపడేవారు తీసి పదార్థాలు తినాలనిపించినపుడు కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల స్వీట్ తిన్న తృప్తి కలుగుతుంది. దీంతో బరువు పెరగకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.
  • దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం మాత్రమే కాదు, ఇది చర్మంను స్మూత్ గా, తేమగా, అందంగా మార్చుతుంది. చర్మంక్రింది కణాకలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.
  • దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను ,నోటి పుండ్లను నివారించడంలో గొప్ప ఔషధం, ముఖ్యంగా నోటి దుర్వాసనను నివారించడంలో, నోటిని చల్లగా ఉంచడం సహాయపడుతుంది. అందుకే దీన్నిమౌత్ రిఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు .
  • దాల్చిన చెక్కతో తయారు చేసిన మసాజ్‌ ఆయిల్‌ వాడినా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడమే కాక ఆ సమయంలో కలిగే వికారాని నిరోధించడలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.
  • దాల్చిన చెక్కలో పవర్ ఫుల్ సినామల్ డీహైడ్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల, ఇది శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను తొలగిస్తుంది. శరీరంలో హెల్తీ సెల్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు
  • దాల్చిన చెక్కతో బరువు తగ్గుతాం కదా అని పదే పదే దాన్ని నమలడం, ఆహార పదార్థాల్లో పొడిని ఎక్కవు మోతాదులో చల్లుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ఎక్కవగా తీసుకుంటే శరీరానికి వేడి చేస్తుంది. అందువల్ల వారినికి ఐదు రోజులు, రోజుకు ఐదు గ్రాముల కంటే మించకుండా చూసుకోవాలి.
Show Full Article
Print Article
Next Story
More Stories