Blue Tea Benefits: ఈ టీ తాగితే..పైసా ఖర్చు లేకుండా కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు.!

Blue Tea Benefits: ఈ టీ తాగితే..పైసా ఖర్చు లేకుండా కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు.!
x

Blue Tea Benefits: ఈ టీ తాగితే..పైసా ఖర్చు లేకుండా కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు.!

Highlights

Blue Tea Benefits: అపరాజిత పువ్వులు, తెలుపు, నీలం రంగులో ఉంటాయి. నీలం రంగులో ఉండే పువ్వుల్లో ఎన్నో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Blue Tea Benefits: మీకు అపరాజిత పువ్వుల గురించి తెలిసే ఉంటుంది. నీలం రంగులో ఉండే ఈ పువ్వులు చూడానికి అందంగా కనిపిస్తాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో శంకుపుష్కాలు అని కూడా పిలుస్తుంటారు. ఆరోగ్యం పరంగా కూడా శంకు పుష్పాలు ఎంతో మేలు చేస్తాయి.ఈ పువ్వులు, తెలుపు, నీలం రంగులో ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ పువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి, డిప్రేషన్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. ఈ పువ్వుల్లో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అపరాజిత పువ్వులతో తయారు చేసిన టీ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. వీటిలో ఒకటి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం వేపుడు ఆహారం, సోమరితనం. దీని కారణంగా సిరల్లో కొవ్వు పేరుకుపోతుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే హార్ట్ స్ట్రోక్ అటాక్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే మీరు డైట్లో బ్లూటీని చేర్చుకోండి. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అజరాజిత పువ్వులతో తయారు చేసే ఈ బ్లూ టీ తాగుతే..సిరల నుండి కొవ్వును తొలగించి..రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఈ బ్లూ టీలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను బర్న్ చేస్తాయి. అంతేకాదు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఈ టీ గుండెకు ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయ్యింది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు టీ తాగడం వల్ల గుండె, నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీథ్రాంబోటిక్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా అపరాజిత టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

టీ ఎలా తయారు చేయాలి?

అపరాజిత పువ్వుల నుండి టీ తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా రెండు మూడు అపరాజితా పుష్పాలను తీసుకుని ఎండబెట్టాలి. తర్వాత వేడి నీళ్లతో బాగా మరిగించాలి. నీరు నీలం రంగులో మారినతర్వాత దానిని ఒక కప్పులో ఫిల్టర్ చేయండి. ఇందులో ఉప్పు, నిమ్మకాయ, పంచదార కలపుకుని తాగవచ్చు. పంచదార ఇష్టం లేనివాళ్లు తేనే కలుపుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.


Show Full Article
Print Article
Next Story
More Stories