Beauty: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.? చాక్లెట్ మాస్క్‌తో ఇట్టే మాయం

Beauty: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.? చాక్లెట్ మాస్క్‌తో ఇట్టే మాయం
x
Highlights

ఇక కోకోపౌడర్‌ తేనెతో పాటు అందులో దాల్చి చెక్క పౌడర్‌ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ముడతలు, మొటిమలు సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. వయసు పెరిగినా కొద్దీ ముఖంపై ముడతలు ఎక్కువవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలలు ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. లేదంటే ఫేస్‌ మాస్క్‌లను వాడుతుంటారు. అయితే సహజంగా ఇంట్లోనే చేసుకునే కొన్ని మాస్క్‌లతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాంటి వాటిలో ఒకటి చాక్లెట్ మాస్క్‌.

చాక్లెట్ మాస్క్‌ ద్వారా చర్మ కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సెడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలోనూ ఇవి సహాయపడతాయి. దీంతో ముఖంపై వచ్చే ముడతలు, వృద్ధాప్య ఛాయలు పోగొట్టుకోవచ్చు. ఇంతకీ చాక్లెట్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఎలా అప్లై చేయాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

చాక్లెట్ మాస్క్‌ తయారు చేయడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని వాటిని బాగా కలపాలి. అనంతరం మిశ్రమం మెత్తగా అయ్యే వరకు కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని చల్లిటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం చర్మం మృదువుగా మారుతుంది. మొటిమల కారణంగా ఏర్పడ్డ మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

ఇక కోకోపౌడర్‌ తేనెతో పాటు అందులో దాల్చి చెక్క పౌడర్‌ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క పొడి, కొకోపౌడర్‌, తేనె వేసిన మిశ్రమాన్ని బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటు, మెడపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొందరికి వీటివల్ల చర్మంపై రియాక్షన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులను సంప్రదించిన తర్వాతే ఇలాంటివి ప్రయత్నించడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories