Chinese Pneumonia: పిల్లలు దగ్గుతున్నారా.. చైనా న్యుమోనియా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

Children are Coughing China Pneumonia Risk is Looming be Careful
x

Chinese Pneumonia: పిల్లలు దగ్గుతున్నారా.. చైనా న్యుమోనియా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

Highlights

Chinese Pneumonia: మరో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. చైనాలో మిస్టీరియస్ న్యుమోనియా విస్తరిస్తోంది. చైనా అంతటా (H9N2) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Chinese Pneumonia: మరో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. చైనాలో మిస్టీరియస్ న్యుమోనియా విస్తరిస్తోంది. చైనా అంతటా (H9N2) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వందలాది మంది చిన్నారులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. చైనాలోని ఆసుపత్రుల వద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి చేరుకునే పిల్లల్లో చాలా మందిలో ఊపిరితిత్తుల్లో మంట, విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబు వంటి అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ న్యూమోనియా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని భారతీయ వైద్యులు చెబుతున్నారు. చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులు ఏదో ఒక వైరస్ వల్ల సోకుతున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండాలి. కేసులు ఎక్కువగా నమోదైతే న్యుమోనియాకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. భారతదేశానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. అయితే పిల్లలకు దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. చైనాలో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి.

భయపడాల్సిన అవసరం లేదు

చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా చిన్నారుల ఊపిరితిత్తులలో నొప్పిని కలిగిస్తోంది. కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యల కారణంగా పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. బీజింగ్‌లోని పీడియాట్రిక్ హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్న పిల్లలతో నిండిపోlooming Beయింది. భారతదేశం గురించి మాట్లాడితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యుమోనియాకు చికిత్స ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories