Health Tips: ముఖంపై మొటిమలకి అరటిపండుతో చెక్..!

Check for Pimples on the Face With a Banana
x

Health Tips: ముఖంపై మొటిమలకి అరటిపండుతో చెక్..!

Highlights

Health Tips: ప్రతి ఒక్కరు అరటిపండ్లని తినే ఉంటారు. అయితే వీటిని మొఖంపై వచ్చే మొటిమల నివారణకి ఉపయోగించవచ్చు.

Health Tips: ప్రతి ఒక్కరు అరటిపండ్లని తినే ఉంటారు. అయితే వీటిని మొఖంపై వచ్చే మొటిమల నివారణకి ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో లక్షలాది మంది మొటిమల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు చాలామంది మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతున్నారు. మరికొందరు ఖరీదైన చికిత్సలు చేయించుకుంటున్నారు. కానీ వీటివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. మళ్లీ కొన్ని రోజులలో ముఖంపై యధావిధిగా మొటిమలు వచ్చేస్తాయి. అయితే మీరు ఇంట్లోనే మొటిమలకు చికిత్స చేయవచ్చు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. దీని కోసం అరటిని ఉపయోగించాలి. అది ఎలాగో తెలుసుకుందాం.

అరటిపండ్లు తిన్న తర్వాత పీల్ మొటిమలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అరటి తొక్కలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది బ్రేక్‌అవుట్‌లను నయం చేస్తుంది. ముఖంపై ఎక్కడ మొటిమలు ఉన్నా అరటిపండు తొక్కతో 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

అరటి తొక్క మురికిగా మారినప్పుడు దాన్ని తీసివేసి మరో తొక్కను ముఖంపై రుద్దాలి. 10 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత ముఖాన్ని కడగాలి. దీన్ని ప్రతిరోజూ చేయాలి. మొటిమల వల్ల ఇబ్బంది పడే వారికి అరటిపండు తొక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. ఇవి సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అరటి తొక్కలో జింక్ ఉంటుంది. ఇది మొటిమలను నయం చేయడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories