Change Habits: 45 ఏళ్ల తర్వాత ఈ అలవాట్లు మార్చుకోండి.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..!

Change These Habits After 45 Years the Risk of Heart Attack will Decrease
x

Change Habits: 45 ఏళ్ల తర్వాత ఈ అలవాట్లు మార్చుకోండి.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..!

Highlights

Change Habits: నేటి రోజుల్లో గుండెపోటు వల్ల చాలామంది మరణిస్తున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉంటుంది.

Change Habits: నేటి రోజుల్లో గుండెపోటు వల్ల చాలామంది మరణిస్తున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి కానీ ఈ రోజుల్లో 20 ఏళ్ల వ్యక్తులు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఎందుకంటే మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చెడు అలవాట్ల కారణంగా ప్రజలు గుండె పోటుకి బలైపోతున్నారు. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని అలవాట్లని మార్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ధూమపానానికి దూరంగా ఉండాలి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే సిగరెట్‌లో హానికరమైన పొగాకు ఉంటుంది. ఇందులో గుండెపోటుకి కారణమయ్యే రసాయన పదార్థాలు ఉంటాయి. అందుకే పొగ తాగడం మానేయండి.

వ్యాయామం చేయండి

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యం. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతే కాదు హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు.

తగినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర అవసరం. ఇందుకోసం రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. బాగా నిద్రపోవడం వల్ల హై బీపీ, డయాబెటిస్, డిప్రెషన్, గుండెపోటు ప్రమాదాలు బాగా తగ్గుతాయి.

ఒత్తిడి తగ్గించుకోండి

నేటి జీవితంలో చాలామంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని తగ్గించుకోవడానికి మద్యపానం, ధూమపానం జోలికి పోకూడదు. యోగా, ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories