Cardamom Benefits: యాలకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ భయంకర వ్యాధులకి పెద్ద అడ్డుకట్ట..!

Cardamom is not Only a Mouth Freshener but Also a Medicine for This Serious Disease
x

Cardamom Benefits: యాలకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ భయంకర వ్యాధులకి పెద్ద అడ్డుకట్ట..!

Highlights

Cardamom Benefits: ఆహారపు రుచిని పెంచే గుణం యాలకులలో ఉంటుంది.

Cardamom Benefits: ఆహారపు రుచిని పెంచే గుణం యాలకులలో ఉంటుంది. అందుకే భారతీయులు వంటలలో ఎక్కువగా వాడుతారు. దీంతోపాటు వీటిని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. యాలకులలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనలో క్యాన్సర్‌తో పాటు అనేక భయంకర వ్యాధులని తగ్గిస్తున్నట్లు తేలింది. యాలకులలో విటమిన్లు, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, రైబోఫ్లావిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీంతోపాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

యాలకులలో ఉండే గుణాలు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడుతాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎలుకలలో యాలకుల పొడిని ఉపయోగించడం వల్ల పరిస్థితి మెరుగుపడింది. యాలకులలో ఉండే కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది.

యాలకులలో ఉండే పోషకాలు ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడతాయి. వీటి ఉపయోగం ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు నోటిలోని కావిటీస్, చెడు వాసనని తొలగిస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. తద్వారా కావిటీలను నివారిస్తుంది. దీంతోపాటు నోటి దుర్వాసన తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories