Dark Circles Remove: డార్క్‌ సర్కిల్స్‌తో బయటికి వెళ్లలేకపోతున్నారా.. ఈ సూపర్‌ రెమిడీ బాగా వర్కవుట్‌ అవుతుంది..!

Cant Go Out With Dark Circles Using Aloe Vera In This Way Will Remove Them
x

Dark Circles Remove: డార్క్‌ సర్కిల్స్‌తో బయటికి వెళ్లలేకపోతున్నారా.. ఈ సూపర్‌ రెమిడీ బాగా వర్కవుట్‌ అవుతుంది..!

Highlights

Dark Circles Remove: కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నప్పుడు చాలామంది అంద విహీనంగా కనిపిస్తారు. ఇవి ముఖం అందాన్ని పాడుచేస్తాయి.

Dark Circles Remove: కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నప్పుడు చాలామంది అంద విహీనంగా కనిపిస్తారు. ఇవి ముఖం అందాన్ని పాడుచేస్తాయి. ముఖ్యంగా ముఖం రంగు వైట్‌గా ఉంటే డార్క్ సర్కిల్స్ మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దీని కారణంగా చాలా మంది బయటికి వెళ్లలేని పరిస్థితులను ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక కుండలో ప్రత్యేక మొక్కను నాటి, దాని జెల్‌ను ఉపయోగించడం వల్ల డార్క్‌ సర్కిల్స్‌ను తొలగించుకోవచ్చు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

కలబందతో నల్లటి వలయాలకి చెక్‌

అలోవెరా అద్భుత ఔషధగుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచి చేకూరుస్తుంది. కలబందను అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి డార్క్ సర్కిల్స్‌ని తొలగించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ను కళ్ల చుట్టూ రాసుకుంటే చర్మం బిగుతుగా మారి ముఖంపై ఉండే ఫైన్ లైన్స్ తగ్గడం మొదలవుతుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. మీకు కావాలంటే మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. కలబందను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినదు.

అలోవెరా ఫేస్‌ మాస్క్‌

నల్లటి వలయాలను తగ్గించడానికి అలోవెరా జెల్‌తో ఫేస్ మాస్క్‌ తయారుచేసుకోవచ్చు. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను పెంచుతాయి. ఈ ఫేస్‌ మాస్క్‌ను సిద్ధం చేయడానికి తేనె, అలోవెరా జెల్ బాగా కలపాలి. మంచి ఫలితాల కోసం రోజ్ వాటర్‌ను కూడా కలుపవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి బాగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లటి వలయాలు పూర్తిగా తొలగి పోతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories