Sex During Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేసుకోవచ్చా?

Sex During Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేసుకోవచ్చా?
x
Highlights

ప్రేమ జీవనంలో లైంగిక సుఖం చాలా ముఖ్యమైనది. ప్రేమ, శృంగారం స్త్రీ, పురుషుల బంధాన్ని మరింత బలంగా మార్చేస్తాయి. ఒక జంట ప్రేమ బంధానికి ప్రతిరూపంగానే...

ప్రేమ జీవనంలో లైంగిక సుఖం చాలా ముఖ్యమైనది. ప్రేమ, శృంగారం స్త్రీ, పురుషుల బంధాన్ని మరింత బలంగా మార్చేస్తాయి. ఒక జంట ప్రేమ బంధానికి ప్రతిరూపంగానే వారికి పిల్లలు పుడతారు.

అయితే, ఒక మహిళ గర్భం ధరించిన తరువాత సెక్స్‌లో పాల్గొనవచ్చా? ఒకవేళ పాల్గొనాలనుకుంటే ఎన్నో నెల వరకు పాల్గొనవచ్చు? గర్భధారణ సమయంలో లైంగిక కోరికలు కలగడం సహజమేనా? గర్భంతో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే కడుపులో బిడ్డకు ఏమైనా హాని కలుగుతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు గర్భం ధరించిన మహిళలను వేధిస్తుంటాయి. వీటికి సరైన సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం.

గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ ఓకేనా?

యుటిరస్‌ కండరాలు బలంగా ఉండడమే కాకుండా, అది విడుదల చేసే అమ్నియోటిక్ ద్రవపదార్థం కడుపులో ఉన్న బిడ్డకు రక్షణ ఇస్తుంది. కాబట్టి, గర్భంతో ఉన్న మహిళ లైంగిక సుఖం పొందడంలో ఎలాంటి సమస్య లేదు. అయితే, గర్భధారణకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే ప్లాసెంటా సరిగా లేకపోవడం వంటివి ఉన్నప్పుడు మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండాలి. అయితే, సెక్స్ పట్ల ఆసక్తి, సానుకూలత అనేవి గర్భం ధరించిన తరువాత కొంత మారుతాయి.

గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేస్తే గర్భస్రావం అవుతుందా?

గర్భం వచ్చిన తరువాత 20 వారాల్లోపు గర్భవిచ్చిత్తి జరగడాన్ని మిస్‌క్యారేజ్ లేదా గర్భస్రావం అంటారు. అయితే, గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయడం వల్ల ఇది జరగదు. గర్భస్రావానికి ప్రధాన కారణం పిండం ఎదగాల్సిన రీతిలో ఎదగకపోవడమే.

సెక్స్ లేదా భావప్రాప్తి తరువాత అప్పుడప్పుడు స్వల్పంగా రక్తస్రావం జరగుతుంది. కానీ, రక్తస్రావం ఎక్కువ కావడం, పీరియడ్స్ సమయంలో లాగా బ్లీడింగ్ పెరగడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

గర్భంతో ఉన్నప్పుడు సరైన సెక్స్ పొజిషన్స్ ఏంటి?

జంటకు సౌకర్యంగా ఉన్న ఏ పొజిషన్ అయినా ఇబ్బంది లేదు. ఏదైనా పొజిషన్‌లో ఇబ్బంది, నొప్పి అనిపిస్తే పొజిషన్ మార్చుకోవాలి. ఈ సమయంలో రోజు రోజుకు పొట్ట పెరుగుతుంది కాబట్టి, ఏ పొజిషన్ అనువుగా ఉందో చూసుకోవాలి. ఏదైనా, సౌకర్యవంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

ఈ సమయంలో కండోమ్స్ అవసరమా?

గర్భంతో ఉన్నప్పుడు లైంగిక వ్యాధులు అంటుకుంటే గర్భవతికి, కడుపులో బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. మీ భాగస్వామికి లైంగిక ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండండి.

మీ భాగస్వామికి ఒకరికన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉంటే కండోమ్ వాడడం మంచిది.

సెక్స్‌కు ఎప్పుడు దూరంగా ఉండాలి?

గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేసుకోవడం వల్ల యుటిరస్ కాంట్రాక్ట్ ఉంటుంది. అయితే, దీనివల్ల చాలా వరకు ఎలాంటి సమస్యలు ఉండవుత. కానీ, బ్లీడింగ్ ఉన్నప్పుడు, అమ్నియోటిక్ ద్రావకం లీక్ అవుతున్నప్పుడు, సెర్విక్స్ గడువుకు ముందుగానే తెరుచుకుంటున్న సంకేతాలు ఉన్నప్పుడు, నెలలు నిండక ముందే ప్రసవించిన చరిత్ర ఉన్నప్పుడు మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండాలి.

సెక్స్ అసలు వద్దనుకుంటే నష్టమా?

ఎలాంటి నష్టం లేదు. వికారం, అలసట వంటి సమస్యలు మీకు సెక్స్ పట్ల ఆసక్తి లేకుండా చేస్తాయి. ఒక్కోసారి ఆ సమయంలో మీ భాగస్వామికి కూడా లైంగిక ఆసక్తి ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సెక్స్ వద్దనుకుంటే ఒకరినొకరు హత్తుకోవచ్చు. ముద్దు పెట్టుకోవచ్చు. దగ్గరితనం వల్ల శరీరానికి చాలా హాయి కలుగుతుంది.

(గమనిక: వైద్య సంస్థలు, నిపుణులు అభిప్రాయాలను అధ్యయనం చేసి అందిస్తున్న ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో ఎప్పుడూ నిపుణులను సంప్రదించడమే మంచిది)


Show Full Article
Print Article
Next Story
More Stories